Skip to main content

ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ గురించి వివరాలను తెలపండి?

Question
ఇండియన్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ గురించి వివరాలను తెలపండి?
రెల్వేస్‌, సెంట్రల్‌ వాటర్‌, సెంట్రల్‌ ఇంజనీరింగ్‌, మిలిటరీ ఇంజనీరింగ్‌, బోర్డర్‌ రోడ్స్‌ ఇంజనీరింగ్‌ వంటి జాతీయ స్థాయి విభాగాల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ వంటి పోస్టుల భర్తీ కోసం.. యూపీఎస్‌సీ ప్రతి ఏటా ఇండియన్‌ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ను నిర్వహిస్తుంది. అర్హత: బీఈ/బీటెక్‌(ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, సివిల్‌, మెకానికల్‌) ఉత్తీర్ణత లేదా తత్సమానం. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. ఎంఎస్సీ లేదా తత్సమాన కోర్సుల్లో వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రానిక్స్‌, రేడియో ఫిజిక్స్‌ లేదా రేడియో ఇంజనీరింగ్‌ సబ్జెక్టులను చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌(ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపిక చేస్తారు.
వివరాలకు:  www.upsc.gov.in

Photo Stories