వీఐటీఈఈఈ–2023 ప్రారంభం
వెల్లూరు, చెన్నై, భోపాల్, ఏపీలోని అమరావతి క్యాంపస్‌ల్లోని బీటెక్ అడ్మిషన్ల కోసం ఈ పరీక్షను వ ర్సిటీ నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ఏప్రిల్ 23 వరకు ప్రతిరోజు మూడు స్లాట్‌ల్లో నిర్వహిస్తున్నట్లు వర్సిటీ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిషన్స్) డాక్టర్ జాన్ ప్రదీప్ తెలిపారు. ఫలితాలను ఏప్రిల్ 26న www.vit.ac.inలో పొందుపరచనున్నారు. లక్ష ర్యాంకులోపు సాధించిన విద్యార్థులకు ఏప్రిల్ 26 నుంచి జూన్ 14 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ జగదీశ్ చంద్ర చెప్పారు.
చదవండి: Btech Jobs 2023 : బీటెక్ పూర్తి చేశారా.. అయితే నెలకు రూ.2 లక్షల వరకు జీతం వచ్చే ఉద్యోగాలు ఇవే..!
1–20,000 ర్యాంకుల వరకు ఏప్రిల్ 26–30 వరకు, 20,001 నుంచి 45,000 ర్యాంకుల వారికి ఏప్రిల్ 29 నుంచి మే 11 వరకు, 45,001 నుంచి 70,000 ర్యాంకుల వరకు మే 20 నుంచి 22 వరకు, 70,001– 1,00,000 ర్యాంకుల వరకు మే 31 నుంచి జూన్ 2 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. లక్ష కంటే ఎక్కువ ర్యాంకు వచి్చన వారికి వీఐటీ–ఏపీ, వీఐటీ–భోపాల్‌ల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. వీరికి జూన్ 12 నుంచి 14 వరకు కౌన్సెలింగ్ ఉంటుంది. తరగతులు ఆగస్ట్ రెండో వారంలో ప్రారంభమవుతాయి.