Skip to main content

TS PGECET Results 2021: నేడు టీఎస్‌ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ స్టేట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంటన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ పీజీఈసెట్‌)–2021 ఫలితాలు నేడు(సెప్టెంబర్‌ 6న) విడుదల కానున్నాయి.
TS PGECET Results

 హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6న మధ్యాహ్నం 2 గంటలకు పీజీఈసెట్‌ ఫలితాలను వెల్లడించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి తెలిపింది. టీఎస్‌ పీజీఈసెట్‌ ద్వారా 2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని కళాశాలల్లో పీజీ కోర్సులైన ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, ఫార్మసీ(ఎంఈ/ ఎంటెక్‌/  ఎంఫార్మా/ ఎంఆర్క్‌)తోపాటు ఫార్మ్‌–డి కోర్సులోనూ ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు పీజీఈసెట్‌ను నిర్వహించింది. పరీక్ష ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు.

Published date : 06 Sep 2021 12:45PM

Photo Stories