Skip to main content

యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీల్లో 1010 సీట్లు ఖాళీ

సాక్షి, అమరావతి: మీరు ఇంజనీరింగ్ విభాగంలో ఎంసెట్-2017 రాశారా? మొదటి విడత కౌన్సెలింగ్‌లో మంచి కాలేజీలో కోరుకున్న సీటు రాలేదా? అయితే ఏం చింతించకండి.. ఇప్పుడు మీ ముందు మరో సువర్ణావకాశం వచ్చి వాలింది.
మొదటి విడత కౌన్సెలింగ్ తర్వాత యూనివర్సిటీ క్యాంపస్ ఇంజనీరింగ్ కళాశాలల్లో 1010 సీట్లున్నాయి. రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 20 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్లు ఇస్తే ప్రభుత్వ కళాశాలలో సీటు పొందే అద్భుత అవకాశాన్ని ఒడిసిపట్టొచ్చు.

కారణమిదే..
ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు తర్వాత మెరిట్ ర్యాంకుల విద్యార్థులు ఆయా కళాశాలల్లో చేరలేదు. వీరంతా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ ప్రైవేటు కళాశాలల్లో చేరడంతో రాష్ట్రంలో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలు, ప్రముఖ ప్రైవేటు కళాశాలల్లో సీట్లు మిగిలాయి. ప్రైవేటు కళాశాలల్లో సుమారు 40,952 సీట్లు అందుబాటులో ఉన్నాయి. రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అడ్మిషన్ల కన్వీనర్ పండాదాస్ బుధవారం సూచించారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. రెండో విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 20, 21, 22న జరుగుతుంది. వెబ్ ఆప్షన్లను కూడా ఈ మూడు రోజులూ నమోదు చేయొచ్చు.

రెండో విడత కౌన్సెలింగ్‌కు అర్హులు వీరే..
మొదటి విడత కౌన్సెలింగ్‌లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకానివారు ఈ రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనొచ్చు (దివ్యాంగులు తదితర ప్రత్యేక కేటగిరీల వారికి మాత్రం ధ్రువపత్రాల పరిశీలనకు అవకాశం ఇవ్వరు). మొదటి విడతలో సీటు పొందినవారు కూడా ఈ రెండో విడత కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. అయితే సీటు లభిస్తే మొదటి విడత సీటు రద్దవుతుంది. కాబట్టి ఆప్షన్లు ఇచ్చేటప్పుడు అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని, మొదటి విడతలో లభించిన సీటు కంటే మంచి కాలేజీలో సీటు కావాలనుకుంటేనే ఆప్షన్లు ఇవ్వాలని కన్వీనర్ సలహా ఇచ్చారు.

వర్సిటీ

కాలేజీ కోడ్

మిగులు సీట్లు

ఆచార్య నాగార్జున, గుంటూరు

ఏఎన్‌సీయూఎస్‌ఎఫ్

52

ఆదికవి నన్నయ్య, రాజమండ్రి

ఏఎన్‌యూఆర్‌ఎస్‌ఎఫ్

34

ఆంధ్రా, విశాఖ

ఏయూసీఈ

122

ఆంధ్రా, విశాఖ,

ఏయూఈడబ్ల్యూఎస్‌ఎఫ్

25

జేఎన్‌టీయూ, అనంతపురం

జేఎన్‌టీఏ

77

జేఎన్‌టీయూ, కలికిరి

జేఎన్‌టీసీ

53

జేఎన్‌టీయూ, కాకినాడ

జేఎన్‌టీకే

118

జేఎన్‌టీయూ, నరసరావుపేట

జేఎన్‌టీఎన్

77

జేఎన్‌టీయూ, పులివెందుల

జేఎన్‌టీపీ

36

జేఎన్‌టీయూ, విజయనగరం

జేఎన్‌టీవీ

89

కృష్ణా వర్సిటీ, మచిలీపట్నం

కేఆర్‌యూఈఎస్‌ఎఫ్

18

శ్రీకృష్ణదేవరాయ, అనంతపురం

ఎస్‌కేయూఏఎస్‌ఎఫ్

72

పద్మావతి, తిరుపతి

ఎస్‌పీఎంయూఎస్‌ఎఫ్

57

శ్రీ వేంకటేశ్వర, తిరుపతి

ఎస్‌వీయూసీ

111

యోగి వేమన, ప్రొద్దుటూరు

వైజీవీయూ

69

మొత్తం

----

1010

Published date : 13 Jul 2017 02:58PM

Photo Stories