Startup Nation: ఇజ్రాయెల్ ‘స్టార్టప్ నేషన్’ ఎందుకయ్యింది?
ప్రపంచానికి సాంకేతికతతో సహా వివిధ ఉత్పత్తులను విక్రయించే ఇజ్రాయెల్ ఇప్పుడు కష్టాల కొలిమిలో చిక్కుకుంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా హమాస్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇజ్రాయెల్ ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. దీన్ని స్టార్టప్ కంట్రీ అని కూడా అంటారు. ఇంతటి ఘనమైన పేరు ఇజ్రాయెల్‌కు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇజ్రాయెల్ పలు ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా స్టార్టప్ వ్యవస్థను అమితంగా ప్రోత్సహించింది. స్టార్టప్‌లకు నిధులను సమకూరుస్తుంది. అభివృద్ధి చెందుతున్న వ్యాపార వ్యవస్థలకు తగిన మద్దతును అందిస్తుంది. ఇటువంటి స్నేహ పూర్వక వాతావరణం కారణంగానే దేశంలో స్టార్టప్‌ల సంఖ్య వేగంగా పెరిగింది.
చదవండి: Startup Hub: ఉమెన్ స్టార్టప్ హబ్
1990లలో ఇజ్రాయెల్.. దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో హైటెక్ విప్లవాన్ని ప్రారంభించింది. ఇజ్రాయెల్ స్టార్టప్‌లు టెల్ అవీవ్ సాంకేతిక కేంద్రం నుండి జెరూసలేం వరకు విస్తరించాయి. దక్షిణ ఎడారి నగరమైన బీర్-షేవాలో కూడా ఇజ్రాయెల్ స్టార్టప్‌లు కనిపిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్టార్టప్‌ల భాగస్వామ్యం కారణంగా ఇజ్రాయెల్.. ‘స్టార్టప్ నేషన్’ హోదాను దక్కించుకుంది.
స్టార్టప్ దేశంగా మారిన ఇజ్రాయెల్ ఆర్థికంగా మరింత బలోపేతంగా మారింది. ఇక్కడి స్టార్టప్‌లు దేశ ఆర్థిక వ్యవస్థలోకి $4.8 బిలియన్ల మూలధనాన్ని ఇంజెక్ట్ చేస్తున్నాయి. ఇందులో 85 శాతం విదేశీ పెట్టుబడిదారులు ఉండటం విశేషం. ఇజ్రాయెల్ తన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో దాదాపు 4.3 శాతం పరిశోధన, అభివృద్ధి రంగాలకు కేటాయిస్తోంది. గూగుల్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ టెక్నాలజీ కంపెనీల పరిశోధనా కేంద్రాలు ఇజ్రాయెల్‌లోనే ఉన్నాయని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇజ్రాయెల్‌లోని పలు స్టార్టప్‌లు హెల్త్ టెక్, మొబైల్ యాప్‌లు, రోబోటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర రంగాలపై దృష్టి సారిస్తున్నాయి.
ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్టార్టప్‌లను కలిగిన దేశంగా పేరుగాంచింది. ఈ దేశంలో ప్రతి 1,400 మందికి ఒక స్టార్టప్ ఉంది. అంటే దేశంలోని ప్రతి 1,400 మంది పౌరులలో కనీసం ఒక స్టార్టప్ వ్యవస్థాపకుడు లేదా సహ వ్యవస్థాపకుడు కనిపిస్తారు. ఇజ్రాయిలీలు పరిశోధన ఆవిష్కరణలకు పెట్టిందిపేరుగా నిలిచారు. ఈ దేశంలో 3,000కు మించిన హై-టెక్ స్టార్టప్‌లు ఉన్నాయి. ఇజ్రాయెల్ కార్మికులు సగటును అత్యధిక వేతనం పొందుతున్నారు. ఈ దేశంలో ప్రతి వ్యక్తి దగ్గర కంప్యూటర్ తప్పనిసరిగా ఉంటుంది.