వృత్తి నైపుణ్యాల వృద్ధికి ఏఐసీటీఈ ఆన్‌లైన్ శిక్షణ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న వృత్తి, సాంకేతిక విద్యా కాలేజీల్లో పనిచేసే ఫ్యాకల్టీపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) శిక్షణ పేరుతో భారం మోపుతోంది.
నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ (ఎన్‌ఐటీటీటీ) పేరుతో ఐదేళ్లలోపు సీనియారిటీ కలిగిన ప్రతి ఫ్యాకల్టీ శిక్షణ తీసుకోవాలని స్పష్టం చేసింది. వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఏఐసీటీఈ ఇచ్చే ఆన్‌లైన్ శిక్షణను కచ్చితంగా తీసుకోవాలని పేర్కొంది. అయితే శిక్షణ పొందేందుకు అధ్యాపకులు సిద్ధంగా ఉన్నా ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో అధ్యాపకుడు రూ. 10 వేల చొప్పు న చెల్లించడమే సమస్యగా మారిందని అధ్యాపకులు అంటున్నారు. అసలే కరోనా దెబ్బతో విద్యాసంస్థలు మూతపడటం, ఎక్కువ శాతం యాజమాన్యాలు 50 శాతం వేతనాలనే ఇవ్వగా, కొన్ని యాజమాన్యాలు అసలే వేతనాలు ఇవ్వని పరిస్థితుల్లో ఎలా శిక్షణ తీసు కుంటామని ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లలోపు అనుభవం కలిగిన ప్రతి అధ్యాపకుడు ఎన్‌ఐటీటీటీ వెబ్‌సైట్‌లో రూ.2 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంది. ఇతర అధ్యాపకులు కూడా పదోన్నతుల కోసం ఈ శిక్షణ పొందవచ్చని పేర్కొంది. అధ్యాపకులు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 30ని చివరి తేదీగా ప్రకటించింది. ఆ తరువాత శిక్షణలో పాల్గొనవచ్చని వివరించింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి కాలపరిమితి మూడేళ్లు ఉంటుందని, ఈ శిక్షణలో 8 మాడ్యూల్స్ ఉంటాయని, ఒక్కో మాడ్యూల్‌కు రూ.వెయి్య చొప్పు న చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇలా 8 మాడ్యూల్స్‌కు రూ.8 వేలు అవుతుండగా, రిజిస్ట్రేషన్ కు వెచ్చించిన రూ.2 వేలు కలుపుకొని మొత్తంగా రూ. 10 వేలు వెచ్చించాల్సి ఉంటుందని అధ్యాపకులు పేర్కొంటున్నారు. ప్రస్తుత లాక్‌డౌన్ పరిస్థితుల్లో రాష్ట్రంలోని 90 వేల మంది అధ్యాపకుల్లో సరిగ్గా వేతనాలు లభించని 70 వేల మంది అధ్యాపకులు ఇబ్బం దులు పడే పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. ఉచిత శిక్షణ అని చెప్పి ఏఐసీటీఈ ఒక్కో ఫ్యాకల్టీ నుంచి ఇం త మొత్తం వసూలు చేయడం సరికాదంటున్నారు.
Published date : 11 Apr 2020 03:44PM