‘విట్- ఏపీ’లో ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ అడ్మిషన్స్
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నెలకొల్పిన వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)లో ఎంటెక్ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు, బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ) కోర్సులను ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నట్లు విట్- ఏపీ వైస్ ప్రెసిడెంట్ డా.శేఖర్ విశ్వనాథన్ మే 19న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
బీబీఏ కోర్సును యానివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌తో కలిసి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐఐఎం-అహ్మదాబాద్ పూర్వ అధ్యాపకుల పర్యవేక్షణలో ఈ కోర్సు ఉంటుందని వివరించారు. విట్-ఏపీ ఇంజనీరింగ్‌కు సంబంధించి మొదటి, రెండు విడతల కౌన్సెలింగ్ ముగిసినట్లు చెప్పారు. ఐదేళ్ల ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు ఇంటర్ ఎంపీసీలో 70 శాతం మార్కులు వచ్చిన వారు మే 31లోపు www.vitap.ac.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. బీబీఏకు మే 25 వరకు వీఐటీఏపీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని విట్ ఏపీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ డాక్టర్ సంధ్యా పెంటారెడ్డి తెలిపారు.
Published date : 21 May 2018 05:33PM