విజ్ఞాన్ యూనివర్సిటీ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల
Sakshi Education
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వ విద్యాలయంలో 2020-21 విద్యా సంవత్సరానికి బీటెక్, బీఫార్మసీ, బీబీఏ, బీసీఏ, బీఎస్సీ, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీహెచ్‌డీల్లో ప్రవేశానికి అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను వర్సిటీ వీసీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ డిసెంబర్ 11న గుంటూరులో విడుదల చేశారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 14 నుంచి 24వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో విజ్ఞాన్‌స స్కోలాస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (వీ-శాట్) నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అడ్మిషన్‌స డీన్ డాక్టర్ వి.రవికుమార్ మాట్లాడుతూ వీశాట్ దరఖాస్తులు విజ్ఞాన్ సంస్థలు, కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని, యూనివర్సిటీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో ఏప్రిల్ ఐదో తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Published date : 13 Dec 2019 05:17PM