వెయిటేజీ 20 శాతం మించడానికి వీల్లేదు: సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీపై హైకోర్టు ఆదేశం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: సబ్ ఇంజనీర్స్ (ఎలక్ట్రికల్) పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల అనుభవానికి ఇచ్చే వెయిటేజీ మార్కులు 20 శాతం దాటడానికి వీల్లేదని హైకోర్టు ఏపీ ట్రాన్స్‌కోకు స్పష్టం చేసింది. అంతకంటే ఎక్కువ మార్కులను ఇవ్వడం ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడింది. సర్వీసు పూర్తి చేసిన ప్రతి సంవత్సరానికి 2 మార్కులు చొప్పున కేటాయించాలని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ నూతి రామ్మోహనరావు రెండు రోజుల కిత్రం తీర్పు వెలువరించారు.
Published date : 14 Dec 2013 11:32AM