వెబ్‌సైట్‌లో ఇంజనీరింగ్ సీట్లు, కాలేజీల జాబితాలేవీ?
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీలు, సీట్లకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ సోమవారమే పూర్తయినా మంగళవారం రాత్రి వరకు కూడా కాలేజీల జాబితాలు, సీట్ల వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రాలేదు.
జేఎన్‌టీయూహెచ్ మాత్రం మంగళవారం సాయంత్రానికే అన్ని కాలేజీ యాజమాన్యాలకు అనుబంధ గుర్తింపునకు సంబంధించిన వివరాలను తెలియజేశామని పేర్కొన్నా మంగళవారం రాత్రి వరకు కొన్ని కాలేజీల యాజమాన్యాలకు మాత్రమే అనుబంధ గుర్తింపునకు సంబంధించిన వివరాలు అందాయి. మరికొన్ని కాలేజీల అనుబంధ గుర్తింపు వివరాలు అందకపోవడంపట్ల కాలేజీ యాజమాన్యాలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మళ్లీ ఏమైనా మార్పులు చేస్తున్నారేమోనన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. కొన్ని కాలేజీల్లో సీట్ల పెంపునకు ప్రభుత్వం, ఉపముఖ్యమంత్రిపై ఒత్తిళ్లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కాలేజీల అనుబంధ గుర్తింపునకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయకపోవడంపట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఇంజనీరింగ్ వెబ్ కౌన్సెలింగ్‌కు రెండు, మూడు రోజుల ముందు వెబ్‌సైట్‌లో జాబితాను పెట్టాలన్న యోచనలో వర్సిటీ అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. కౌన్సెలింగ్ సమయంలో ఒకవేళ కోర్టుకెళ్లినా తమకు ఆటంకాలు అడ్డుకావని, కౌన్సెలింగ్ సజావుగా సాగుతుంద ని వారు యోచిస్తున్నారు.
6 నుంచి 9 వరకు వెబ్ ఆప్షన్లు!: ఇంజనీరింగ్ కాలేజీల్లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ఈ నెల 6 నుంచి 9 వరకు చేపట్టేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. 10న ఆప్షన్లలో మార్పులకు అవకాశం కల్పించాలనుకుం టోంది. 12 లేదా 13న సీట్ల కేటాయింపును ప్రకటించనుంది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం 13 నుంచి రెండో దశ కౌన్సెలింగ్‌ను చేపట్టే అవకాశం ఉంది. 19 నుంచి తుది దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించి ప్రవేశాలను చేపట్టాలను కుంటోంది. షెడ్యూల్‌ను బుధవారం ఖరారు చేయొచ్చని తెలుస్తోంది. కాగా.. జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపుపై యాజమాన్యాలకు అభ్యంతరాలు ఉంటే ఈ నెల 4 వరకూ అధికారులకు అప్పీల్ చేసుకోవచ్చని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు.

Published date : 01 Jul 2015 03:22PM