ఉపాధి కల్పన దిశగా కేఎల్ యూనివర్సిటీ కృషి అభినందనీయం
Sakshi Education
గాంధీనగర్ (విజయవాడసెంట్రల్): నలభై ఏళ్ల క్రితం స్థాపించిన కేఎల్ ఇంజనీరింగ్ కళాశాల ఎందరో విద్యార్థుల భవిష్యత్‌ను తీర్చిదిద్దిందని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. 2020
విద్యా సంవత్సరానికి సంబంధించి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ పోస్టు గాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ నోటిఫికేషన్ ఆయన విడుదల చేశారు. గవర్నర్‌పేటలోని కేఎల్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో అడ్మిషన్ లోగో, బ్రోచర్, వాల్‌పోస్టర్‌ను అక్టోబర్ 18న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా యూనివర్సిటీ కృషి చేయడం అభినందనీయమన్నారు. యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డా. ఏ.రామ్‌కుమార్ మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. అడ్మిషన్స్ విభాగం డెరైక్టర్ జె. శ్రీనివాసరావు మాట్లాడుతూ బీటెక్, ఇంజనీరింగ్ కోర్సులలో రెండు దఫాలుగా ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 16 నుంచి 22 వరకు మొదటి దఫా ఆన్‌లైన్ పరీక్ష, వచ్చే ఏడాది ఏప్రిల్ 13 నుంచి 20 వరకు రెండో దఫా ఆన్‌లైన్ పరీక్ష జరుగుతుందని తెలిపారు. దరఖాస్తులు ఆన్‌లైన్ లేదా యూనివర్సిటీ విద్యా కేంద్రాల ద్వారా పొందవచ్చునన్నారు.
Published date : 19 Oct 2019 03:07PM