ఉమ్మడి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షకు బ్రేక్
Sakshi Education
న్యూఢిల్లీ: 2018 నుంచి దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్షను నిర్వహించాలన్న నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది.
ఇటీవల ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష విధానాన్ని సమీక్షించిన తర్వాతే ఉమ్మడి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షపై ముందుకు వెళ్లాలని కేంద్ర మానవవనరుల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఓ ఉన్నతాధికారి మీడియాతో మాట్లా డుతూ.. ‘వచ్చే ఏడాది జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నాం. పరీక్ష నిర్వహణ సాధ్యాసాధ్యాలపై ఏఐసీటీఈ నివేదిక సమర్పించిన అనంతరమే తుది నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు.
Published date : 24 Aug 2017 02:19PM