TS Engineering Colleges Fee Structure 2022 PDF : ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల ఖరారు.. ఏఏ కాలేజీలో ఎంత ఫీజు అంటే..
అడ్మిషన్, ఫీజుల నియంత్రణ కమిటీ(ఏఎఫ్‌ఆర్‌సీ) సిఫార్సుల మేరకు 159 కాలేజీల్లో ఫీజులు ఖరారు చేస్తూ తెలంగాణ సర్కార్ అక్టోబర్ 19వ తేదీన (బుధవారం) జీవో జారీ చేసింది.
Engineering: పెరిగిన కంప్యూటర్ సైన్స్ కోర్సు సీట్లు
అదే విధంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస రుసుమును రూ.45వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 40 కాలేజీల్లో ఇంజినీరింగ్ ఫీజు రూ.లక్ష దాటింది. ఎంజీఐటీ రూ.1.60లక్షలు, సీవీఆర్ రూ.1.50లక్షలు, సీబీఐటీ, వర్ధమాన్, వాసవీ రూ.1.40లక్షలుగా నిర్ణయించింది. మూడేళ్లపాటు కొత్త ఇంజనీరింగ్ ఫీజులు అమల్లో ఉండనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
☛ Top Engineering Colleges 2022 Andhra Pradesh | Telangana
అంతేగాక ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ ఫీజులు సైతం ప్రభుత్వం పెంచింది. ఎంబీయే, ఎంసీయే కనీస వార్షిక ఫీజు రూ.27వేలుగా.. ఎంటెక్ కనీస వార్షిక రుసుము రూ.57వేలకు పెంచుతూ జీవో జారీ చేసింది.