ట్రిపుల్ ఐటీలకు 28 వేల దరఖాస్తులు
Sakshi Education
హైదరాబాద్: బాసర, ఇడుపులపాయ, నూజివీడుల్లోని ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం 28 వేలమంది దరఖాస్తు చేసుకున్నట్టు రాజీవ్‌గాంధీ సాంకేతిక విద్యా వైజ్ఞానిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ రాజ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కొంతమంది విద్యార్థులు దరఖాస్తు ఫారం ప్రింట్‌తోపాటు తమ సర్టిఫికెట్ల హార్డ్‌కాపీలను తమకు పంపించలేదని పేర్కొన్నారు. వారంతా ఈనెల 21వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తమ కార్యాలయానికి పంపించాలని సూచించారు. ఆ లోగా పంపించని వారి దరఖాస్తులను ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణించాల్సి వస్తుందని తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తు హార్డ్‌కాపీతోపాటు, సర్టిఫికెట్లను పంపించని విద్యార్థుల వివరాలను తమ వెబ్‌సైట్‌లో ఉంచినట్టు వెల్లడించారు.
Published date : 09 Jun 2014 11:36AM