టీఎస్ ‘ఇంజనీరింగ్’ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు నేడు ఆఖరు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ మొదటి దశ ప్రవేశాల్లో సీటు లభించిన విద్యార్థులు ఈనెల 21 లోగా ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల క్యాంపు కార్యాలయం వెల్లడించింది.
ఫీజు రీయింబర్సమెంట్‌కు అర్హులైన వారు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని పేర్కొంది. గురువారం సెల్ప్ రిపోర్టింగ్ చేయకపోతే సీటు ఆటోమెటిక్‌గా రద్దవుతుందని, చివరి దశ కౌన్సెలింగ్‌లోకి వెళ్తుందని వెల్లడిం చింది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులంతా ఈనెల 22వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టు చేయాలని వెల్లడించింది. అయితే కాలేజీల్లో చేరే సమయంలో యాజమాన్యానికి ఎలాంటి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. బ్యాంకు చలానాతో సహా అన్ని సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలనే ఇవ్వాలని పేర్కొంది. ఈనెల 24, 25 తేదీల్లో చివరి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది. మొదటి దశలో సీట్లు లభించిన విద్యార్థులు కూడా చివరి దశలో ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొంది.
Published date : 21 Jul 2016 01:16PM