తెలంగాణలో మొదలైన ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Sakshi Education
హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ గురువారం ప్రారంభమైంది. మొదటి రోజు వెరిఫికేషన్‌కు 25 వేల ర్యాంకులోపు విద్యార్థులకు 11,030 మందిని పిలువగా, 6,061 మంది హాజరైనట్లు సాంకేతిక విద్యా కమిషనర్ శైలజా రామయ్యార్ తెలిపారు. తెలంగాణలోని 23 హెల్ప్‌లైన్ కేంద్రాల్లో వెరిఫికేషన్‌ను చేపట్టామని చెప్పారు. సీట్లు భర్తీ చేసే కాలేజీల సంఖ్యపై 15 లేదా 16న స్పష్టత వస్తుందన్నారు. 17నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభిస్తామని తెలిపారు.
ఏపీలో 31,428 మంది సర్టిఫికేట్ల వెరిఫికేషన్:
ఎంసెట్ ఇంజనీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కు ఆంధ్రప్రదేశ్‌లో గురువారం 5,642 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నెల 7 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రారంభించగా గురువారం నాటికి మొత్తం 31,428 మంది వెరిఫికేషన్‌కు హాజరైనట్టు ఉన్నత విద్యా మండలి తెలియజేసింది.
డాక్టర్ ఆఫ్ ఫార్మసీ ప్రవేశాలకు సవరణ ఉత్తర్వులు:
డాక్టర్ ఆఫ్ ఫార్మసీ (ఫార్మ్-డి) కోర్సులో ప్రవేశాలకు సవరణ ఉత్తర్వులను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్ గురువారం జారీ చేశారు. 30 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి సంబంధించి ఈ ఉత్తర్వులను జారీ చేశారు.

Published date : 15 Aug 2014 11:20AM