తెలంగాణలో ఇంజనీరింగ్ సీట్లు కేటాయింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో 56,046 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. ఎంసెట్ మొదటి దశ కౌన్సెలింగ్ లో ప్రవేశాలు పొందిన విద్యార్థు లకు ప్రవేశాల కమిటీ ఈనెల 28న సీట్లను కేటాయించింది.
రాష్ట్రంలోని 197 ఇంజనీరింగ్ కాలేజీల్లో 70 శాతం కన్వీనర్ కోటాలో 64,300 సీట్లు అందుబాటులో ఉండగా.. అందులో మొదటి దశ కౌన్సెలింగ్‌లో 56,046 మంది విద్యార్థు లకు సీట్లు లభించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. మరో 8,254 సీట్లు మిగిలిపోయినట్లు వెల్లడించారు. తెలం గాణ ఎంసెట్‌లో 1,06,058 మంది విద్యా ర్థులు అర్హత సాధించినా సర్టిఫికెట్ల వెరిఫికే షన్‌కు కేవలం 64,402 మంది మాత్రమే హాజరయ్యారు. అందులో 63,588 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. వారిలో 7,347 మంది విద్యార్థులకు సీట్లు లభించలేదు. ఇక ఇంజనీరింగ్‌పాటు బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కలుపుకుంటే మొత్తంగా 309 కాలేజీల్లో 67,698 సీట్లు ఉండగా, 56,241 సీట్లు భర్తీ అయ్యాయి. 11,457 సీట్లు మిగిలిపోయాయి.
91 కాలేజీల్లో వంద శాతం భర్తీ...
రాష్ట్రంలో 309 ఇంజనీరింగ్, బీ ఫార్మసీ, ఫార్మ్-డీ కాలేజీల్లో కన్వీనర్ కోటా ప్రవేశాలకు చర్యలు చేపట్టగా.. మొదటి దశ కౌన్సెలింగ్‌లో 91 కాలేజీల్లో 100% సీట్లు భర్తీ అయ్యాయి. 22 బ్రాంచీల్లో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. 9 బ్రాంచీల్లోనే సీట్లు మిగిలి పోయాయి. ఈసారి ఒక్క విద్యార్థి చేరని కాలేజీ ఒక్కటి కూడా లేకపోవడం విశేషం. 12 కాలేజీల్లో మాత్రం 50 మంది లోపే చేరగా, మరో నాలుగు కాలేజీల్లో 10 మంది లోపు చేశారు.
త్వరలో ప్రవేశాల కమిటీ భేటీ :
మిగిలిన సీట్లలో ప్రవేశాలకు చివరి దశ కౌన్సెలింగ్‌ను వచ్చే నెలలోనే నిర్వహించే అవకాశం ఉంది. ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల ప్రక్రియ చివరి దశకు చేరుకున్న తర్వాతే రాష్ట్రంలో ఎంసెట్ ప్రవేశాల చివరి దశ కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఐఐటీ, ఎన్‌ఐటీల ఆరో దశ కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు జూలై 29న ముగియనుంది. అంతవరకు కాకపోయినా వచ్చేనెల 15 తర్వాతే చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటిదాకా జరిగిన ఐదు దశల కౌన్సెలింగ్‌లో జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో సీట్లు లభించని వారు రాష్ట్ర విద్యా సంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది. త్వరలోనే ప్రవేశాల కమిటీ సమావేశమై ఇంజనీరింగ్ తరగతుల ప్రారంభ తేదీతోపాటు చివరి దశ కౌన్సెలింగ్ తేదీలను ఖరారు చేసే అవకాశం ఉంది.
ఇవీ సీట్ల కేటాయింపు వివరాలు..
సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరి:
ఇంజనీరింగ్ మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు వెబ్‌సైట్‌లోకి (https://tseamcet.nic.in) లాగిన్ అయి తప్పని సరిగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. లేదంటే సీటు రద్దు అవుతుందని పేర్కొన్నారు. ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించ ని విద్యార్థులు, ట్యూషన్ ఫీజు వర్తించే విద్యార్థులు తప్పనిసరిగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. వచ్చేనెల 7వ తేదీలోగా ఫీజు చెల్లించని వారి, కాలేజీల్లో రిపోర్టు చేయని విద్యార్థుల సీటు కేటాయింపు రద్దవుతుం దని తెలిపారు.
సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే విధానం..

కోర్సు | కేటగిరీ | కాలేజీలు | మొత్తం సీట్లు | కేటాయింపు | ఖాళీలు భర్తీ | శాతం |
ఇంజనీరింగ్ | యూనివర్సిటీ | 14 | 3,060 | 3060 | 0 | 100 |
ఇంజనీరింగ్ | ప్రైవేటు | 183 | 61,240 | 52,986 | 8,254 | 86.52 |
మొత్తం | -- | 197 | 64,300 | 56,046 | 8,254 | 87.16 |
బీఫార్మసీ | యూనివర్సిటీ | 3 | 80 | 26 | 54 | 32.50 |
బీఫార్మసీ | ప్రైవేటు | 109 | 2,878 | 125 | 2,753 | 4.34 |
మొత్తం | -- | 112 | 2958 | 151 | 2,807 | 5.10 |
ఫార్మ్-డి | ప్రైవేటు | 44 | 440 | 44 | 396 | 10 |
మొత్తం | | 309 | 67,698 | 56,241 | 11,457 | 83.08 |
సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరి:
ఇంజనీరింగ్ మొదటి దశ కౌన్సెలింగ్‌లో సీటు పొందిన విద్యార్థులు వెబ్‌సైట్‌లోకి (https://tseamcet.nic.in) లాగిన్ అయి తప్పని సరిగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. లేదంటే సీటు రద్దు అవుతుందని పేర్కొన్నారు. ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించ ని విద్యార్థులు, ట్యూషన్ ఫీజు వర్తించే విద్యార్థులు తప్పనిసరిగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. వచ్చేనెల 7వ తేదీలోగా ఫీజు చెల్లించని వారి, కాలేజీల్లో రిపోర్టు చేయని విద్యార్థుల సీటు కేటాయింపు రద్దవుతుం దని తెలిపారు.
సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే విధానం..
- విద్యార్థులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకో వాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిం చని వారు వెబ్‌సైట్‌లో చలానా జనరేట్ చేసుకో వాలి. తర్వాత ఫీజును ఏదైనా స్టేట్ బ్యాం కులో చలానా రూపంలో చెల్లించాలి. లేదా వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నెట్ బ్యాంకిం గ్/ క్రెడిట్/ డెబిట్ కార్డుతో చెల్లించవచ్చు.
- ఫీజును చలానా రూపంలో చెల్లించిన వారు, ఆన్‌లైన్‌లో చెల్లించిన వారు వెబ్‌సైట్ లోకి లాగిన్ కాగానే అభ్యర్థి వివరాలు వస్తాయి. అక్కడ చలానా నంబర్/ఆన్‌ై లెన్‌లో పే చేసిన ఏటీఆర్ ఎన్ నంబర్‌ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. జాయినింగ్ రిపోర్టు వస్తుంది. ప్రింట్ తీసుకోవాలి.
- ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించే విద్యా ర్థులు తమ వివరాలతో వెబ్‌సైట్‌లోకి లాగిన్ కాగానే సెల్ఫ్ రిపోర్టింగ్ అప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే జాయినింగ్ రిపోర్ట్ వస్తుంది. ఆ ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
- విద్యార్థులు ఈ నెల 29 నుంచి వచ్చేనెల 7వ తేదీలోగా కాలేజీలో రిపోర్ట్ చేయాలి. అలాట్‌మెంట్ ఆర్డర్, జాయినింగ్ రిపోర్టు, ఫీజు చెల్లించిన చలానా జిరాక్స్ కాపీలను అంద జేయాలి. చివరి దశ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లను చలానాలను కాలేజీలో ఇవ్వొద్దు. విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్/ పేమెంట్ వివరాలను సరిచూసుకొని వ్యూ జాయినింగ్/ఫీ పేమెం ట్ ట్రాన్సాక్షన్ రిపోర్టు తీసుకోవాలి. కావాల నుకుంటే వాటి ఆధారంగా తర్వాతి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.
Published date : 29 Jun 2017 01:52PM