తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల నిర్ధారణ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చే మూడేళ్ల పాటు వసూలు చేసుకోవాల్సిన ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది.
తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) అందజేసిన ప్రతిపాదనలకు కొన్ని మార్పులు, చేర్పులతో ఆమోద ముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య సోమవారం రాత్రే సంతకం చేశారు. అయితే సాంకేతిక కారణాల వల్ల ఉత్తర్వుల కాపీ విడుదల కాలేదు. ఇది మంగళవారం ఉదయం అందుబాటులోకి రానుంది. కాలేజీల వారీగా ఫీజుల వివరాలను విద్యార్థులు ఎంసెట్ వెబ్‌సైట్ tseamcet.nic.in లో చూసుకుని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు. గరిష్ట ఫీజు 1,13,000 కాగా, కనీస ఫీజు 35,000గా ప్రభుత్వం నిర్ణయించింది. నాలుగు కాలేజీల్లో రూ.లక్ష, అంతకంటే ఎక్కువ ఫీజును ఖరారు చేయగా... 69 కాలేజీలకు కనీస ఫీజు రూ.35,000గా మాత్రమే నిర్ణయించింది.
8 కాలేజీలకు రూ.35 వేల నుంచిరూ.39 ,000... 119 కాలేజీలకు రూ.40 వేల నుంచి రూ.59 వేల వరకు.. 17 కాలేజీలకు రూ.60 వేల నుంచి రూ.69,000.. 16 కాలేజీలకు రూ.70 వేల నుంచి రూ.79,000.. 5 కాలేజీలకు రూ.80 వేల నుంచి రూ.89,000.. 14 కాలేజీలకు రూ.90 వేల నుంచి రూ.99 వేల వరకు ఫీజు నిర్ణయించింది. ఈ ఫీజులు 2016-17, 2017-18, 2018-19 విద్యా సంవత్సరాలకు వర్తిస్తాయి.
పెరిగిన ఫీజులు :
కనీస ఫీజు ఉన్న కాలేజీలు మినహా మిగతా కాలేజీల్లో ఫీజులు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు పెరిగాయి. కొన్ని కాలేజీల్లో మాత్రం రూ.30 వేల వరకు పెరిగింది. రాష్ట్రంలో సగటు ఫీజు రూ.49,768గా నిర్ణయించింది. గతంలో ఈ ఫీజు రూ.41 వేలకు పైగా ఉండగా.. ఈసారి 8 వేల వరకు పెరిగింది.
కొన్ని ప్రధాన కాలేజీల్లో ఫీజులు :

కాలేజీ | ఫీజు |
సీబీఐటీ | 1,13,500 |
వాసవి | 86,000 |
ఎంవీఎస్‌ఆర్ | 95,000 |
శ్రీనిధి | 91,000 |
గోకరాజు రంగరాజు | 95,000 |
సీవీఆర్ | 90,000 |
మాతృశ్రీ | 67,000 |
ఎంజీఐటీ | 1,00,000 |
కేఎంఐటీ | 77,000 |
కిట్స్ | 1.05,000 |
వర్ధమాన్ | 1.05,000 |
బీవీఆర్‌ఐటీ | 95,000 |
మల్లారెడ్డి | 78,000 |
సీఎంఆర్ | 75,000 |
అనురాగ్ గ్రూప్ | 93,000 |
స్టాన్లీ | 62,000 |
వీఎన్‌ఆర్‌విజ్ఞాన్‌జ్యోతి | 98,500 |
విద్యాజ్యోతి | 80,000 |
వీబీఐటీ | 67,000 |
టీకేఆర్ | 57,000 |
జి.నారాయణమ్మ | 95,000 |
గురునానక్ | 75,000 |
Published date : 05 Jul 2016 02:16PM