Skip to main content

తెలంగాణలో ఏఎఫ్‌ఆర్‌సీ సూచనల ప్రకారమే ఫీజులు!

సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద వృత్తి విద్యా కోర్సుల ఫీజుల చెల్లింపులపై స్పష్టత వచ్చింది.
2016-17 నుంచి 2018-19 విద్యా సంవత్సరం మధ్య కాలంలో బీటెక్, బీ-ఫార్మసీ, బీ-ఆర్క్, ఎంటెక్, ఎం-ఆర్క్ తదితర వృత్తి విద్యా కోర్సులకు ఏఎఫ్‌ఆర్‌సీ (అడ్మిషన్ అండ్ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ) ఇటీవల ఫీజులు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద చెల్లించే అంశంపై సమీక్షించిన ఎస్సీ అభివృద్ధి శాఖ.. తాజాగా ఏఎఫ్‌ఆర్‌సీ సూచనల ఆధారంగా ఫీజులు ఆమోదిస్తూ సెప్టెంబర్ 13న ఉత్తర్వులు ఇచ్చింది. ఉపకార వేతనాలు మాత్రం పాత విధానాన్నే అనుసరిస్తుండగా.. ఫీజులు మాత్రం 2016-17 నుంచి 2018-19 మధ్యనున్న బ్లాక్ పీరియడ్‌కు కొత్తగా నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించనుంది.

వసతుల ఆధారంగానే ఫీజులు...
ఇంటర్మీడియట్, డిగ్రీ కోర్సులకు సంబంధించి ఫీజు ల్లో పెద్దగా మార్పులు లేనప్పటికీ వృత్తివిద్యా కోర్సుల ఫీజుల్లో భారీ వ్యత్యాసముంది. సాధారణ కాలేజీల్లో ఫీజులతో పొల్చుకుంటే టాప్ కాలేజీల్లో ఎక్కువ మొత్తంలో ఫీజులున్నాయి. ఈ క్రమంలో ఏఎఫ్‌ఆర్‌సీ బృందం తనిఖీలు నిర్వహించిన తర్వాత అక్కడ కల్పి స్తున్న మౌళిక వసతుల ఆధారంగా ఫీజులు నిర్దేశిం చింది. రీయింబర్స్‌మెంట్ కింద బీటెక్ సాధారణ ఫీజు రూ.35 వేలుండగా.. వాసవీ, సీబీఐటీ వంటి కాలేజీల్లో రూ.1.20 లక్షల వరకూ ఫీజు ఉంది. క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టి ఫీజులు ఖరారు చేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిబంధనల మేరకు ఏఎఫ్‌ఆర్‌సీ ధ్రువీకరించిన ఫీజులను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆమోదించింది. ఫీజుల వివరాలను ఈ పాస్ వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. తాజాగా నిర్ధారించిన ఫీజులు 2018-19 వరకు చెల్లిస్తారు.
Published date : 14 Sep 2017 02:07PM

Photo Stories