తెలంగాణ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ మే నెలాఖరున
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మే నెలాఖరులో ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించేందుకు సాంకేతిక విద్యాశాఖ కసరత్తు చేస్తుంది.
మే నెల 18న ఎంసెట్ ఫలితాలు వెలువడనుండటంతో వీలైనంత త్వరగా యూనివర్సిటీల నుంచి అనుబంధ గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలను తెప్పించుకోవాలని భావిస్తోంది. మే నెలాఖరులో ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తే జూలై ఆఖరుకు పూర్తి చేయవచ్చని భావిస్తోంది. మరోవైపు ఈసారి విద్యార్థుల ఎంసెట్ దరఖాస్తులతో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను లింకు చేస్తోంది. తద్వారా సంబంధిత ప్రవేశాల వెబ్‌సైట్‌లోని లింకును క్లిక్ చేస్తే విద్యార్థుల పూర్తి వివరాలు వస్తాయి. అందులో విద్యార్థుల కులం, ఆదాయ సర్టిఫికెట్ల నంబర్లను ఎంటర్ చేస్తే ఆన్‌లైన్‌లోనే వెరిఫికేషన్ పూర్తవుతుంది. విద్యార్థి లోకల్ స్టేటస్‌కు సంబంధించి మాత్రం వెరిఫికేషన్‌ను చేయనుంది.
Published date : 09 May 2018 05:47PM