షరతులతో.. ఎంసెట్ రెండో విడత అడ్మిషన్లకు సుప్రీం అనుమతి
Sakshi Education
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, ఫార్మసీ అడ్మిషన్ల కోసం ఎంసెట్ కౌన్సెలింగ్ గడువును పెంచేందుకు సుప్రీంకోర్టు ఎట్టకేలకు అనుమతించింది. అయితే ఇందుకు పలు షరతులు విధించింది. ఈ తీర్పు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమని పేర్కొంది.
174 కళాశాలలకే కౌన్సెలింగ్
ఈ ఉత్తర్వుల ప్రకారం ‘2014-15 సంవత్సరానికి ఇంజనీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్‌కు 174 పైచిలుకు కళాశాలలను జే ఎన్టీయూహెచ్, తెలంగాణ ప్రభుత్వం అనుమతించలేదు. వర్సిటీ చెబుతున్న ప్రకారం ఈ కళాశాలలు సరైన ప్రమాణాలు పాటించలేదు. మౌలిక వసతులు లేవని వర్సిటీ చెబుతోంది. అయితే వీటికి ఈ విద్యాసంవత్సరానికి ఏఐసీటీఈ అనుమతి ఉంది. అలాగే వీటిని కౌన్సెలింగ్‌కు అనుమతించాలని హైకోర్టు కూడా ఆదేశాలిచ్చినట్లు మా ద ృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అడ్మిషన్లు పొందేందుకు వీలుగా ప్రస్తుత ఉత్తర్వులను జారీచేస్తున్నాం. 2013-14కు అనుబంధ గుర్తింపు కలిగి, 2014-15కు అనుబంధ గుర్తింపు పొందలేక, కేవలం ఏఐసీటీఈ అనుమతి మాత్రమే కలిగి ఉన్న కళాశాలలను.. అంటే తొలి కౌన్సెలింగ్‌లో పాల్గొనని 174 పైచిలుకు కాలేజీలకు ఈ తీర్పు వర్తిస్తుంది. అక్టోబర్ 31న కౌన్సెలింగ్ ప్రక్రియకు నోటిఫికేషన్ జారీచేయాలి. నవంబర్ 14 నాటికి ప్రక్రియ పూర్తిచేయాలి. నవంబర్ 15 నుంచి తరగతులు ప్రారంభించాలి. అలాగే తొలి సెమిస్టర్ తరగతుల బోధనను జనవరి 30 నాటికి పూర్తిచేయాలి. అంటే సుమారు 76 రోజుల సమయం ఉంది. వీటిలో ఆదివారాలు, క్రిస్మస్, డిసెంబర్ 31, జనవరి 1 తేదీలను మినహాయించి.. మిగిలిన రోజుల్లో రోజుకు 8 నుంచి ఎనిమిదిన్నర గంటలు బోధించవ చ్చు. ఈ లెక్కన జనవరి 30 నాటికి 525 గంటలను పూర్తిచేయవచ్చు. ఆ తర్వాత ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు ప్రిపరేషన్ కోసం సెలవులు ఇవ్వాలి. ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు పరీక్షలు నిర్వహించాలి. సెకండ్ సెమిస్టర్ మార్చి 2 నుంచి జూన్ 30 వరకు కొనసాగాలి’ అని ధర్మాసనం పేర్కొంది.
అనుబంధ గుర్తింపు ఇలా..
‘2014-15కు అనుబంధ గుర్తింపు పొందని కళాశాలలు నవంబర్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలి. కాలేజీలకు గుర్తింపు ఇచ్చేందుకు వీలుగా తనిఖీలు చేసుకోవచ్చు. అయితే ఇందుకు యూనివర్సిటీ కాకుండా తెలంగాణలో ఉన్న ఐఐటీ-హైదరాబాద్, బిట్స్ సంస్థల నిపుణులతో ఏర్పాటుచేసిన ఒక కమిటీని వినియోగించుకోవాలి. (ఆ సంస్థలతో తనిఖీలు చేయించేందుకు వీలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం, వర్సిటీ తరఫు న్యాయవాదులు కోరారు) కళాశాలలు కూడా ఈ తనిఖీలకు సహకరించాలి. తనిఖీలన్నీ పూర్తయ్యాక యూనివర్సిటీ అనుబంధ గుర్తింపునకు సంబంధించి ఉత్తర్వులు వెలువరించాలి. డిసెంబర్ 31లోగా ఈ నిర్ణయం తీసుకోవాలి. గుర్తింపు నిరాకరిస్తే ఎందుకు నిరాకరించారో కోర్టుకు వర్సిటీ చెప్పాలి. అలాగే గత ఏడాది ఎందుకు ఇచ్చారో కూడా చెప్పాలి. ఒకవేళ చిన్నచిన్న లోపాలు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకోరాదు. మౌలిక వసతులన్నీ ఉండేలా చూడాలి. కానీ 10 కంప్యూటర్లు లేనిచోట 100 కంప్యూటర్లు లేవంటూ రాయకూడదు. కళాశాలలు కూడా వ ర్సిటీ నిర్ణయాన్ని సవాలు చేయవచ్చు. అడ్మిషన్లు షరతులపై ఇస్తున్నట్టు విద్యార్థులకు తెలియపరచాలి. ఒకవేళ అనుబంధ గుర్తింపు లభించకపోతే ఫీజును వడ్డీతో సహా వెనక్కిచ్చేందుకు వీలుగా విద్యార్థుల పేరుతో ప్రత్యేక ఖాతా తెరవాలి’ అని ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు.
కేవలం తెలంగాణకే..
‘ఈ ఉత్తర్వులు కేవలం తెలంగాణ రాష్ట్రానికే వర్తిస్తాయి. దీనికి అనుగుణంగా మరే ఇతర రాష్ట్రం కౌన్సెలింగ్ నిర్వహించేందుకు అవకాశం తీసుకోరాదు. అలాగే ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులు కళాశాల మార్చుకునేందుకూ వీలు లేదు. రీ అడ్మిషన్ పొందేందుకు కూడా వీలు లేదు. ఎంసెట్‌లో అర్హత సాధించి అడ్మిషన్ తీసుకోని వారు మాత్రమే ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. ఇక ప్రత్యేక పరిస్థితుల్లో తక్కువ రోజుల్లో ఎక్కువ తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్థుల హాజరు తప్పనిసరిగా 75 శాతం ఉండాలి. అలా హాజరు లేని వారిని తదుపరి సెమిస్టర్‌కు అనుమతించకూడదు. తాజా షెడ్యూలును అనుసరిస్తామని కళాశాలలవారీగా ప్రమాణ పత్రం సమర్పించాలి. అనుబంధ గుర్తింపు కోసం ఇచ్చే ప్రమాణ పత్రం, షెడ్యూలు కోసం ఇచ్చే ప్రమాణ పత్రంలో దేనినైనా ఉల్లంఘిస్తే.. తాజా తీర్పును ఉల్లంఘించినట్టుగానే పరిగణిస్తాం. కళాశాలలు తగిన వసతులు ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా నెల గడువు ఇస్తున్నాం’ అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇదీ షెడ్యూల్
కౌన్సెలింగ్ నోటిఫికేషన్: అక్టోబర్ 31, 2014
కౌన్సెలింగ్ ముగింపు: నవంబర్ 14, 2014
తరగతులు ప్రారంభం: నవంబర్ 15, 2014
తొలి సెమిస్టర్ బోధన ముగింపు: జనవరి 30, 2015
పరీక్షలకు ప్రిపరేషన్ సెలవులు: ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు
పరీక్షల నిర్వహణ: ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2 వరకు
సెకండ్ సెమిస్టర్ ప్రారంభం: మార్చి 2, 2015
తరగతులు, ప్రిపరేషన్ పూర్తి: జూన్ 30, 2015
పరీక్షల నిర్వహణ: జూలై 1 నుంచి 15 వరకు
సుప్రీం తీర్పు సారాంశం
‘కౌన్సెలింగ్ గడువు పొడిగింపు కేవలం తెలంగాణ రాష్ట్రానికే వర్తిస్తుంది. ఇదివరకే అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులు. రీ అడ్మిషన్‌కు, కళాశాల మార్పునకూ అవకాశం లేదు. గత విద్యాసంవత్సరం అనుబంధ గుర్తింపు ఉండి, ఈసారి గుర్తింపు పొందకుండా.. ఏఐసీటీఈ అనుమతి మాత్రం ఉన్న 174 పైచిలుకు కాలేజీలకు ఈ తీర్పు వర్తిస్తుంది. కోర్టు సూచించిన షరతుల ప్రకారం కౌన్సెలింగ్, తరగతులు నిర్వహించాలి. వసతుల ఏర్పాటుకు నెల గడువిస్తున్నాం. ఐఐటీ-హైదరాబాద్, బిట్స్ సంస్థల నిపుణులతో కూడిన కమిటీతో తనిఖీలు జరగాలి. చిన్నాచితక కారణాలతో గుర్తింపు రద్దు చేయడం సరికాదు. తనిఖీల తర్వాత అనుబంధ గుర్తింపు రద్దయితే ఆయా కాలేజీల్లోని విద్యార్థుల అడ్మిషన్లు కూడా రద్దవుతాయి. వారి ఫీజులు వడ్డీతో సహా వెనక్కిచ్చేలా ప్రత్యేక ఖాతా నిర్వహించాలి. విద్యార్థులకు ఈ షరతులు ముందే తెలపాలి. తొలి సెమిస్టర్‌లో 75 శాతం హాజరు లేకపోతే రెండో సెమిస్టర్‌కు అనుమతించకూడదు’
- గడువు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు, 174 కాలేజీలకు ఊరట
- కౌన్సెలింగ్ తెలంగాణకే పరిమితం
- అడ్మిషన్లు పొందని విద్యార్థులకే చాన్స్
- అక్టోబర్ 31న నోటిఫికేషన్,
- నవంబర్ 15 నుంచి తరగతులు
- కాలేజీల తనిఖీలకు నిపుణులతో కమిటీ
- వసతుల కల్పనకు నెల రోజుల గడువు
- అనుబంధ గుర్తింపు పొందకపోతే
- అడ్మిషన్లు రద్దు, ఫీజులు వాపస్

Published date : 30 Oct 2014 12:34PM