సామాజిక బాధ్యతగా ఏఈసీ-ప్రపంచస్థాయి బోధన, వసతులతో ‘మహీంద్ర’కళాశాల
Sakshi Education
పూర్తిగా పరిశ్రమలతో అనుసంధానం... విద్యార్థికి ఏటా ఇంటర్న్‌షిప్ ‘సాక్షి’తో మహీంద్ర ఎకోల్ సెంట్రల్ బోర్డు సభ్యుడు రాహుల్ భూమన్
హైదరాబాద్:దేశ పారిశ్రామికరంగంపై తనదైన ముద్రవేసిన మహీంద్ర గ్రూప్ ఇప్పుడు సమాజానికి తనవంతు చేయూతగా విద్యారంగంలోకి అడుగుపెట్టిందని మహీంద్ర ఎకోల్ సెంట్రల్(ఎంఈసీ) బోర్డు సభ్యుడు రాహుల్ భూమన్ పేర్కొన్నారు. ఎంఈసీ ఇంజనీరింగ్ కాలేజీ ద్వారా ప్రస్తుత ఇంజనీరింగ్ విద్యకు భిన్నంగా నేచురల్ సెన్సైస్‌పై ప్రధానంగా దృష్టిపెడుతూ అంతర్జాతీయ బోధన ప్రమాణాలు, మౌలిక వసతులతో నిపుణులైన ఇంజనీర్లను తయారుచేయనున్నట్లు తెలిపారు. ఎంఈసీ ఏర్పాటు లక్ష్యాలపై ఆయన సాక్షితో మాట్లాడారు.
సాక్షి: రాష్ట్రంలో ఐఐటీ, ఎన్‌ఐటీ, బిట్స్, ట్రిపుల్‌ఐటీలు, వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఈసీ అవసరమేంటి?
రాహుల్: సామాజిక బాధ్యతగా మహీంద్ర గ్రూప్ ఈ కళాశాలను ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుత విద్యావిధానం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా లేదు. ఆ అవసరాలను తీర్చడానికి ప్రపంచస్థాయి విద్యాసంస్థను నెలకొల్పే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నాం.
సాక్షి: ఎంఈసీ ఇతర విద్యాసంస్థలకు ఏవిధంగా భిన్నం?
రాహుల్: ఐఐటీలు సహా ఇంజనీరింగ్ కాలేజీలన్నీ 40 ఏళ్ల నాటి కరికులమ్‌తో బోధిస్తున్నాయి. ఆ కరికులమ్ ఉత్పత్తిరంగానికి ఉద్దేశించినది. కానీ ఇప్పుడు ఉత్పత్తిరంగ వాటా కేవలం 18 శాతమే. అందుకే యూరప్ విద్యావిధానంలో 200 ఏళ్ల అనుభవమున్న ఎకోల్ సెంట్రల్, జేఎన్టీయూహెచ్‌లతో ఒప్పందం చేసుకుని ఐదేళ్ల ఎంటెక్ డిగ్రీ కోర్సు కోసం అంతర్జాతీయస్థాయి పారిశ్రామిక అవసరాలను తీర్చగలిగే కరికులం రూపొందించాం.
సాక్షి: ప్రస్తుత కరికులంతో ఉపయోగం లేదా?
రాహుల్: అది పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా లేదు. ఆత్మవిశ్వాసం, భాష, టీంవర్క్, ప్రాజెక్టు రూపకల్పన నైపుణ్యాలు లోపించాయి. మా ఐదేళ్ల కోర్సులో ఫ్రెంచ్ భాష కూడా నే ర్పిస్తాం. తొలి రెండున్నరేళ్లు నేచురల్ సెన్సైస్, బేసిక్ సెన్సైస్ బోధిస్తాం. ఆ తర్వాతే స్పెషలైజేషన్ బోధనలు ఉంటాయి.
సాక్షి: ఎంఈసీలో మౌలిక వసతులు ఎలా ఉంటాయి?
రాహుల్: ఎంఈసీది సమీకృత అనుసంధానిత వ్యవస్థ. ప్రపంచంలో ఎక్కడినుంచైనా ముఖాముఖిగా బోధనలు వినే, పారిశ్రామిక నిపుణులతో మాట్లాడే సదుపాయాలు ఉన్నాయి. పరిశోధనలు లక్ష్యంగా ఎనర్జీ, ఇన్‌ఫ్రా, మెటీరియల్ సైన్స్, డిఫెన్స్, కంప్యూటింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ రంగాలకు సంబంధించి ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం.
సాక్షి: ఎలాంటి బోధన వసతులు ఉంటాయి?
రాహుల్: పరిశోధనల ప్రాతిపదికగా బోధనలు ఉంటాయి. అధ్యాపకులు వారి సమయంలో సగాన్ని పరిశోధనలకే కేటాయిస్తారు. వారిలో 40 శాతం మంది విదేశీ ప్రొఫెసర్లే. అధ్యాపకులు, విద్యార్థుల నిష్పత్తి 1:10గా ఉంటుంది.
సాక్షి: విద్యార్థులకు మీ సంస్థలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి?
రాహుల్: ఇక్కడే చదివే విద్యార్థులకు విదేశాల్లో 6 నెలల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. దీనివల్ల అంతర్జాతీయ పనితీరుపై అవగాహన వస్తుంది. దీనికితోడు విద్యార్థి ఐదేళ్లపాటు ప్రతి ఏటా ఇంటర్న్‌షిప్ చేయాలి.

Published date : 23 Dec 2013 12:10PM