రీయింబర్స్‌మెంట్ మార్గదర్శకాలు విడుదల
Sakshi Education
హైదరాబాద్: ఎంటెక్, ఎం.ఫార్మసీ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి మార్గదర్శకాలను సాంఘిక సంక్షేమ శాఖ బుధవారం జీవో 86 రూపంలో విడుదల చేసింది. ఎంటెక్ అడ్‌హక్ ఫీజుగా రూ. 48,500 ఖరారుచేసిన 121 కళాశాలలకు రూ. 48,500 లేదా తుది ఖరారు అనంతరం గరిష్టంగా రూ. 57 వేలు చెల్లించనున్నట్టు పేర్కొంది. అలాగే రూ. 57 వేల నుంచి రూ. 1,51,600 వరకు ఫీజు ఖరారైన 345 కళాశాలలకు రూ. 57 వేలు చెల్లించనుంది. రూ. 57 వేలుగా ఉన్న మరో 49 కళాశాలలకు రూ. 57 వేలు చెల్లించనుంది. ఎం.ఫార్మసీలో అడ్‌హక్ ఫీజు ఉన్న 79 కళాశాలలకు గరిష్టంగా రూ. 1,10,000, రూ. 95,600 నుంచి రూ. 1,40,000 వరకు ఉన్న 155 కళాశాలల విద్యార్థులకు గరిష్టంగా రూ. 1,10,000 వరకు చెల్లిస్తుంది.
Published date : 07 Nov 2013 10:58AM