రేపు ఈ-సెట్... ఏర్పాట్లు పూర్తి
Sakshi Education
కాకినాడ, న్యూస్‌లైన్ : రాష్ట్రవ్యాప్తంగా శనివారం నిర్వహించనున్న ఈ-సెట్‌కు ఏర్పాట్లు చేసినట్టు జేఎన్‌టీయూకే ఉప కులపతి, ఈ-సెట్-2014 చైర్మన్ జి.తులసీరాందాస్, కన్వీనర్, జేఎన్‌టీయూకే డెరైక్టర్ డాక్టర్ సీహెచ్.సాయిబాబు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 12 రీజినల్ సెంటర్లలోని 91 కేంద్రాల్లో ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించబోమని పేర్కొన్నారు. ఈ పరీక్షకు ఈ ఏడాది 52,027 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. విద్యార్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తుపై పాస్‌పోర్టు సైజ్ కలర్ ఫొటో అతికించి, కళాశాల ప్రిన్సిపాల్ లేదా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి, ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలని, ఆయన సమక్షంలో సంతకం చేయాలని సూచించారు.
Published date : 09 May 2014 11:32AM