రేపు ఎంటెక్, ఎంఫార్మసీ సీట్ల కేటాయింపు
Sakshi Education
హైదరాబాద్: ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులో సీట్లను బుధవారం కేటాయించే అవకాశం ఉంది. ప్రవేశాల కమిటీ ఉదయం సమావేశమై సాయంత్రం సీట్ల కేటాయింపును ప్రకటించనుంది.
ఇందుకు ఏపీ ఉన్నత విద్యామండలి ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆయా కాలేజీల అఫిలియేషన్ల విషయంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో షరతులతో సీట్ల కేటాయింపును ప్రకటించాలని ఏపీ ఉన్నత విద్యా మండలి నిర్ణయానికి వచ్చింది.
Published date : 04 Nov 2014 12:21PM