ఫిబ్రవరి 5 వరకు గుర్తింపు గడువు: ఏఐసీటీఈ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తదితర సాంకేతిక విద్యా సంస్థలు 2018-19 విద్యా సంవత్సరంలో గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన గడు వును ఫిబ్రవరి 5 వరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పొడగించింది.
వాస్తవానికి జనవరి 31తోనే గడువు ముగిసిందని, కానీ కాలేజీ యాజమాన్యాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ గడువును పెంచినట్లు ఏఐసీటీఈ పేర్కొంది. ఆయా విద్యా సంస్థలు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫిబ్రవరి 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. ఇక ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 10లోగా దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత ఎట్టిపరిస్థితుల్లో దరఖాస్తుల గడువును పెంచేది లేదని స్పష్టం చేసింది.
Published date : 01 Feb 2018 02:07PM