పీజీఈసెట్‌లో ఆప్షన్లు ఇచ్చింది సగం మందే
Sakshi Education
ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికై నిర్వహించిన పీజీఈసెట్‌లో అర్హత పొందిన వారిలో సగం మందే వెబ్ కౌన్సెలింగ్ లో పాల్గొన్నారు. ప్రవేశపరీక్షలో 97,640 మంది అర్హత సాధించగా, 50,030 మందే వెబ్ ఆప్షన్లు ఇవ్వడం గమనార్హం. రెండురాష్ట్రాల్లో 58వేల సీట్లుండగా, వాటిలో చేరేందు కు అభ్యర్థులే కరువయ్యారు. ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసుకున్న పీజీఈసెట్ అభ్యర్థులు.. తమ వెబ్‌ఆప్షన్లను మార్చుకునేందుకు మరొక అవకాశం కల్పిస్తున్నామని కన్వీనర్ వే ణుగోపాల్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ రివైజ్డ్ షెడ్యూల్‌ను pgecet.apsche.ac.in వెబ్‌సైట్లో ఉంచినట్టు కన్వీనర్ తెలిపారు. రివైజ్డ్ షెడ్యూల్ ఇలా..
తేదీ | ర్యాంకులు |
20 | గేట్/జీప్యాట్(నమోదైన) ర్యాంకర్లు/ పీజీఈసెట్‌లో 1-1000 వరకు |
21 | 1001-5000 వరకు |
22 | 5001-1000 వరకు |
23 | 10001 నుంచి చివరి వరకు |
Published date : 20 Sep 2014 12:19PM