పీజీఈసెట్‌కు లక్షా 16 వేల దరఖాస్తులు
Sakshi Education
హైదరాబాద్: ఇంజనీరింగ్‌లోని వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించనున్న పీజీఈసెట్-2014కు లక్షా 16 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు కన్వీనర్ ప్రొ.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. ఈ సంఖ్య గత ఏడాది కంటే 13 వేలు ఎక్కువన్నారు. ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగే పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు చెప్పారు. ఇంత వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ నెల 14 వరకు రూ.2 వేలు, 20 వరకు రూ.5 వేలు, 24 వరకు రూ.10 వేల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
Published date : 07 May 2014 12:02PM