Skip to main content

పీజీ కోర్సుల కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పి.రమేశ్‌బాబు సోమవారం తెలిపారు.
ఆగస్టు 3 నుంచి 12 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 7 నుంచి 16 వరకు వెబ్‌ఆప్షన్స్ ఇచ్చుకోవాలని వివరించారు. కౌన్సెలింగ్ కోసం హైదరాబాద్‌లో జేఎన్‌టీయూ, సైఫాబాద్ పీజీ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కళాశాల, ఏవీ కాలేజ్, కాకతీయ వర్సిటీ క్యాంపస్‌లోని ఫార్మసీ కాలేజీల్లో సర్టిఫికెట్ల పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 2015-16 విద్యా సంవత్సరానికి వివిధ ఇంజనీరింగ్ పీజీ కోర్సులు ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ అండ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు చెప్పారు. వివరాలకు, వెబ్‌ఆప్షన్స్‌కు  www.tspgecet.org/ www.tspgecet.tsche.ac.in వెబ్‌సైట్లు చూడొచ్చు.
Published date : 28 Jul 2015 03:01PM

Photo Stories