పాలీసెట్ వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పాలీసెట్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యే విద్యార్థులంతా వెబ్ ఆప్షన్లు ఇవ్వాలని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు.
మే 14 నుంచి 16 వరకు 16,103 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారని పేర్కొన్నారు. వీరిలో కేవలం 2,311 మందే మే 16 నాటికి ఆప్షన్లు ఇచ్చారని తెలిపారు. మిగిలిన వారు మే 21లోగా ఆప్షన్లు ఇచ్చుకోవాలని సూచించారు. మే 17న 44,001 నుంచి 66 వేల ర్యాంకుల విద్యార్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. స్పెషల్ కేటగిరీలో ర్యాంకులు సాధించిన విద్యార్థులందరికీ మే 17న మాసాబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యా భవన్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతామన్నారు.
Published date : 17 May 2018 02:29PM