పాలీసెట్ కౌన్సెలింగ్‌కు గడువు పెంపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: పాలిసెట్-2014 మలిదశ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు గడువు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఈనెల 9వ తేదీ ఉదయం 10గంటలవరకు అభ్యర్థులు తమ ఆప్షన్లను మార్చుకునే వెసులుబాటు ఉందని వారు పేర్కొన్నారు. షెడ్యూలు ప్రకారం ఆదివారంతో గడువు ముగియనుండగా, వరుస సెలవుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సెలింగ్ క్యాంపు అధికారి ఒకరువెల్లడించారు.
Published date : 08 Sep 2014 12:38PM