ఒంగోలు విద్యార్థికి ఈసెట్‌లో ఫస్ట్ ర్యాంక్
Sakshi Education
ఒంగోలు, న్యూస్‌లైన్ : ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించిన ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఈసెట్) లో ఒంగోలుకు చెందిన వెలనాటి అయ్యప్ప (హాల్‌టికెట్ నెం. 7380011) బీఎస్పీ (మ్యాథ్స్) విభాగంలో రాష్ట్రంలో మొదటి ర్యాంకు సాధించాడు. కాకినాడ జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈసెట్-2014లో అతడికి 112 మార్కులు వచ్చాయి. ఒంగోలుకు చెందిన అయ్యప్ప నిరుపేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి రామయ్య స్థానిక ఉడ్ కాంప్లెక్సులో రోజువారీ రిక్షా కూలీగా పనిచేస్తుంటాడు. ఆర్థిక స్థోమత అంతంతమాత్రంగా ఉన్నా కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలన్న రామయ్య కలను అయ్యప్ప నెరవేర్చాడు. అయ్యప్ప విజయవాడలోని పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశాడు. ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్‌లో చేరి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావడమే తన జీవిత లక్ష్యమని అయ్యప్ప చెప్పారు.
Published date : 20 May 2014 11:35AM