Skip to main content

నవంబర్‌లో ఐఐటీ - ఢిల్లీ.. మారిషస్ క్యాంపస్

ఇంజనీరింగ్ కోర్సులను అందించడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) - ఢిల్లీ.. ఈ ఏడాది నవంబర్‌లో మారిషస్‌లో క్యాంపస్‌ను ప్రారంభించనుంది. ఈ కొత్త క్యాంపస్ పేరు ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రీసెర్చ్ అకాడమీ (ఐఐటీఆర్‌ఏ). ఐఐటీ- ఢిల్లీ.. మారిషస్ రీసెర్చ్ కౌన్సిల్‌తో కలిసి ఈ విద్యా సంస్థకు శ్రీకారం చుట్టింది. ఐఐటీఆర్‌ఏ.. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో ఫుల్‌టైం, పార్ట్‌టైం విధానాల్లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్‌డీ) కోర్సులను అందించనుందని ఐఐటీ-ఢిల్లీ వర్గాలు తెలిపాయి. ముందుగా ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులను ఆఫర్ చేస్తారు. ఆ తర్వాత యూజీ పోగ్రామ్స్‌ను కూడా అందించే అవకాశం ఉంది. ఐఐటీల మాదిరిగానే సాంకేతిక విద్యలో పరిశోధనలకు ప్రోత్సాహమందించడం ఇన్‌స్టిట్యూట్ ప్రధాన లక్ష్యం. భవిష్యత్‌లో మరికొన్ని దేశాల్లో ఇలాంటి సంస్థలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు ఐఐటీ-ఢిల్లీ తెలియజేసింది.
Published date : 02 Oct 2014 12:11PM

Photo Stories