నవంబర్ 1 నుంచి బీటెక్, బీ ఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ తదితర ఫస్టియర్ క్లాసులు: ఏఐసీటీఈ
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల్లో తరగతులు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యేలా అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) షెడ్యూల్‌ను సవరించింది.
ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి సీనియర్ విద్యార్థులకు, నవంబర్ 1 నుంచి ఫస్టియర్ విద్యార్థులకు పాఠ్యాంశాల బోధన తరగతులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు తాజాగా సవరించిన అకడమిక్ క్యాలెండర్ 2020-21ను విడుదల చేసింది.
- ఏఐసీటీఈ ఏప్రిల్‌లో అకడమిక్ క్యాలెండర్‌ను తొలుత విడుదల చేసినప్పటికీ కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జూలై 2న సవరించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది.అయితే, కేంద్రం విద్యా సంస్థల మూసివేతను ఆగస్టు 31వరకు పొడిగించింది.
- పస్తుతం వివిధ సంస్థలను తెరిచేందుకు ప్రభుత్వం వెసులుబాటునిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా మరిన్ని సవరణలతో అకడమిక్ క్యాలెండర్‌ను ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి రాజీవ్‌కుమార్ విడుదల చేశారు.
- పతి విద్యా సంస్థకు యూనివర్సిటీ లేదా బోర్డు ఇచ్చే అనుబంధ గుర్తింపు జారీ ప్రక్రియను సెప్టెంబర్ 15వ తేదీలోపు పూర్తి చేయాలి.
- సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సీనియర్ విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతిలో లేకుంటే రెండు విధాలుగా బోధన చేపట్టొచ్చు. పీజీడీఎం, పీజీసీఎం కోర్సులకు ఈ తేదీ వర్తించదు.
- వివిధ కోర్సు(సాంకేతిక, వృత్తి విద్య యూజీ, పీజీ)ల్లో ప్రవేశాలకు సంబంధించి.. అక్టోబర్ 20వ తేదీ నాటికి తొలి విడత, నవంబర్ ఒకటో తేదీ నాటికి రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి చేసి విద్యార్థులకు సీట్లు కేటాయించాలి. సీట్లు పొందిన విద్యార్థులకు నవంబర్ ఒకటో తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
- వివిధ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు తమ సీట్లను రద్దు చేసుకోవాలని భావిస్తే నవంబర్ 10వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలి. మొత్తంగా 15వ తేదీ నాటికి కళాశాలల్లో ఖాళీగా ఉన్న సీట్లలో విద్యార్థులు చేరాలి.
Published date : 17 Aug 2020 12:54PM