నేటి నుంచి ఎంసెట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Sakshi Education
హైదరాబాద్: తెలంగాణలోని 161 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 5, 6 తేదీల్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభం కానుంది.
అలాగే 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఇచ్చుకోవచ్చు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 13 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా హైదరాబాద్‌లో నాలుగు ఉన్నాయి. ఏఏ హెల్ప్‌లైన్ కేంద్రంలో ఏ ర్యాంకు విద్యార్థుల సర్టిఫికెట్లను వెరిఫై చేయించుకోవచ్చనే వివరాలను eamcet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
Published date : 05 Nov 2014 12:19PM