నాలుగేళ్లలో 40 వేల ఇంజనీర్ పోస్టుల భర్తీ
Sakshi Education
తెలంగాణ జెన్‌కో అండ్ ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే నాలుగేళ్లలో 40 వేల మంది ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోనున్నదని తెలంగాణ జెన్‌కో అండ్ ట్రాన్స్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు అన్నారు.
బుధవారం హైదరాబాద్‌లో బంజారాహిల్స్ రోడ్ నం. 3లోని ముఫకంజా ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన నూతన విద్యార్థుల పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణలో విద్యుత్ కోతలు ఉండవని అందుకు తగిన ప్రణాళికలు అమలవుతున్నాయని చెప్పారు. ఇంజనీర్లు లేనిదే విద్యుత్ తయారీ కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర అవసరాలకు 8,500 మెగావాట్ల విద్యుత్ అవసరముండగా రాబోయే నాలుగేళ్లలో 20 వేల మెగావాట్ల ఉత్పత్తి చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి కోసం 22 వేల మంది ఇంజనీర్ల అవసరం ఉందని తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే 2,600 ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుల్తాన్ ఉల్- ఉలూం విద్యా సంస్థ చైర్మన్ ఖాన్ లతీఫ్ ఖాన్, గౌరవ కార్యదర్శి జాఫర్ జావెద్, ముఫకంజా కాలేజీ డెరైక్టర్ ప్రొఫెసర్ బషీర్ అహ్మద్, తెలంగాణ ట్రాన్స్‌కో డెరైక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.

Published date : 06 Aug 2015 02:52PM