మూడున్నరేళ్లకే బీటెక్.. ఐఐటీ-ఖరగ్‌పూర్ కొత్త విధానం
Sakshi Education
ఖరగ్‌పూర్: ఐఐటీ విద్యార్థులు తమ కోర్సును వేగంగా లేదా కొంత ఆలస్యంగా పూర్తి చేసుకునేందుకు వీలు కల్పిస్తూ ఐఐటీ ఖరగ్‌పూర్ సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ కొత్త క్రెడిట్ ఆధారిత విధానం వల్ల నాలుగేళ్ల బీటెక్ కోర్సును మూడున్నరేళ్లలోనే పూర్తి చేసుకునే అవకాశముంటుంది. ప్రతి కోర్సులోనూ విద్యార్థి ప్రతిభ ఆధారంగా క్రెడిట్లు లభిస్తాయి. నిర్దేశిత క్రెడిట్లను ముందుగానే సాధించిన విద్యార్థి కోర్సును ఆరు నెలల ముందే పూర్తి చేయవచ్చు. లేదంటే మధ్యలోనే ఏడాది ఇంటర్న్‌షిప్ కోసం వెళ్లి, ఆ తర్వాత తిరిగొచ్చి మిగతా కోర్సును పూర్తి చేయొచ్చు. ఈ విధానాన్ని 2016 నుంచి దశలవారీగా అమలు చేస్తామని ఐఐటీ-ఖరగ్‌పూర్ డెరైక్టర్ పార్థాప్రతిమ్ చక్రవర్తి తెలిపారు.
Published date : 28 Jul 2014 12:03PM