Skip to main content

Study Abroad: ఇలా బీటెక్కు .. అలా ఫ్లైటెక్కు

సాధారణ డిగ్రీకన్నా బీటెక్‌ వంటి సాంకేతిక విద్య కోర్సుకు డిమాండ్‌ ఎక్కువనేది నిర్వివాద అంశం.
Study Abroad
ఇలా బీటెక్కు .. అలా ఫ్లైటెక్కు

బీటెక్‌ చేస్తే ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, జీవితంలో త్వరగా స్థిరపడేందుకు వీలవుతుందని తల్లిదండ్రులు, విద్యార్థులు భావిస్తుండటమే ఇందుకు కారణం. బీటెక్‌ తర్వాత ఎంటెక్‌ చేయడం కూడా ఒక కలగా ఉండేది. చాలామంది బీటెక్‌తో సరిపుచ్చుకోకుండా ఎంటెక్‌లో చేరేందుకు ఆసక్తి చూపించేవారు. కానీ తర్వాత ట్రెండ్‌ మారిపోయింది. ఇటీవలి కాలలో ఎంటెక్‌లో ప్రవేశాలు గణనీయంగా తగ్గిపోయాయి. 

బీటెక్‌ తర్వాత ఎమ్మెస్సే..!

బీటెక్‌ పూర్తయిందా.. నెక్స్‌›్ట ఏంటి? అన్న ప్రశ్న ఉత్పన్నం కావడం లేదనే చెప్పాలి. బీటెక్‌లో ఉండగా క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారానో, బీటెక్‌ తర్వాత ఏదోరకంగా.. మంచి కంపెనీలో ఆకర్షణీయమైన ప్యాకేజీతో ఉద్యోగం వస్తే సరేసరి. లేదంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్క విద్యార్థీ, అప్పు చేసైనా సరే అమెరికా.. కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో ఎమ్మెస్‌ కోసం వెళ్లిపోతున్నాడు. 

చదువు..సంపాదన

అప్పు చేసైనా పిల్లలను విదేశాలకు పంపాలనే తపన తల్లిదండ్రుల్లో కనబడుతోంది. ఏదేమైనా ఎమ్మెస్‌ చేసి తీరాలన్న కోరిక మెజారిటీ విద్యార్థుల్లో బలంగా ఉంటోంది. మరోవైపు బ్యాంకులు కూడా స్వదేశీ విద్య కన్నా విదేశీ విద్యకే రుణాలు ఎక్కువగా ఇస్తున్నాయి. అయితే విదేశీ చదువులకు విద్యార్థులు కేవలం చదువు కోసమే వెళ్ళడం లేదు. చదువుకుంటూనే సంపాదించుకునేందుకు, చేసిన అప్పులు తీర్చేందుకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు. చదువుకుంటున్న సమయంలోనే అనధికారికంగా చిన్నా చితక ఉద్యోగాలతో సంపాదించుకునే అవకాశాలు పలు దేశాల్లో ఉంటున్నాయి. అలా రెండేళ్ళల్లో ఎంఎస్‌ కోర్సు పూర్తిచేసి, వీసా అవకాశం ఉన్న మరో రెండేళ్ళ సమయంలో ఏదో ఒక ఉద్యోగంలో చేరి అక్కడ స్థిరపడిపోయేవారు అధిక సంఖ్యలో ఉంటున్నారు.

ఎంటెక్‌ పరిస్థితి ఎందుకిలా?

  • ప్రధాన కంపెనీలు చాలావరకు బీటెక్‌ డిగ్రీ కనీస అర్హతతోనే ఉద్యోగాలు ఆఫర్‌ చేస్తున్నాయి. ఎంటెక్‌ విద్యార్థులకు ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఈ కారణంగా ఎంటెక్‌ చేసినా ప్రయోజనం ఏమిటనే భావన విద్యార్థుల్లో నెలకొంటోంది.
  • ఒకప్పుడు బీటెక్‌ తర్వాత ఉద్యోగం రానివాళ్ళు.. సమయం వృధా కాకుండా ఉండేందుకు ఎంటెక్‌లో చేరేవారు. ఎంటెక్‌లో చేరినా ఇతర పోటీ పరీక్షలపై దృష్టి పెట్టేందుకు, ఉపాధి అవకాశాలు వెతుక్కునేందుకు అప్పట్లో అవకాశం ఉండేది. బయో మెట్రిక్‌ హాజరు అమలులోకి వచ్చిన తర్వాత ఈ అవకాశం లేకుండా పోయింది. దీంతో ఎంటెక్‌లో చేరేవాళ్ళ శాతం గణనీయంగా తగ్గింది.
  • బీటెక్‌ పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్ ఇంజనీరింగ్‌ (గేట్‌) రాసి ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీటు వస్తుందనుకున్నప్పుడు మాత్రమే ఎంటెక్‌లో చేరేందుకు ఇష్టపడుతున్నారు.

చదువుకుంటూనే ఉద్యోగం చేశా

హైదరాబాద్‌లో బీటెక్‌ మెకానికల్‌ చేశా. రెండేళ్ళు ఇక్కడే ఓ చిన్న కంపెనీలలో నెలకు రూ. 20 వేల చొప్పున ఉద్యోగం చేశా. తర్వాత రూ. 20 లక్షలు అప్పు చేసి ఎమ్మెస్‌ కోసం ఆస్ట్రేలియా వచ్చా. చదువుతూనే సూపర్‌ మార్కెట్లో ఉద్యోగం చేశాను. చేసిన అప్పులు తీరాయి. ఈ మధ్యే ఆస్ట్రేలియా ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగం వచ్చింది.
– ఆదిత్య, వరంగల్‌ నుంచి వెళ్లిన విద్యార్థి

చదువు, సంపాదన రెండూ సులభం

బీటెక్‌ తర్వాత అమెరికా వెళ్ళాలన్నదే నా గోల్‌. అప్పు చేసి ఆర్నెల్ల క్రితం అమెరికా వచ్చా. వచ్చిన రెండు నెలలకే ఓ రెస్టారెంట్‌లో చిన్న జాబ్‌ దొరికింది. వసతి, భోజనం ఖర్చులకు సంపాదన సరిపోతోంది. ఇక్కడ చదువు బట్టీ విధానంలో ఉండదు. కాబట్టి తేలికగా ఉంటుంది. కొంత సమయం వెచ్చిస్తే సరిపోతుంది. అందుకే చాలామంది మిగతా సమయం ఏదో ఒక పార్ట్‌ టైం జాబ్‌ చేసుకోవడానికే ఇష్టపడుతున్నారు.
– ఉదయ్, హైదరాబాద్‌ నుంచి వెళ్ళిన విద్యార్థి

మంచి వేతనాల కోసమే

ఇక్కడ ఎంటెక్‌ చేసినా బీటెక్‌ చేసిన వాళ్ళ కన్నా గొప్ప ఉద్యోగాలేమీ రావడం లేదు. మన దేశంతో పోల్చుకుంటే అమెరికా ఉద్యోగ వేతనాల్లో భారీ తేడా ఉందనే విషయం తెలిసిందే. అమెరికాలో ఎమ్మెస్‌ తర్వాతే ఉద్యోగాలిస్తారు. అందుకే మన వాళ్లు బీటెక్‌ పూర్తవ్వగానే ఎమ్మెస్‌ కోసం అమెరికా, ఇతర దేశాలకు వెళ్తున్నారు. అనుకున్నట్టే ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నారు.

              – తుమ్మల పాపిరెడ్డి, (మాజీ చైర్మన్, ఉన్నత విద్యా మండలి)

రాష్ట్రంలో గత ఆరేళ్లలో బీటెక్, ఎంటెక్లో చేరికలు ఇలా..

సంవత్సరం

బీటెక్‌

ఎంటెక్‌

2015–16

70,792

7,795

2016–17

73,686

6,001

2017–18

68,594

4,799

2018–19

68,296

5,185

2019–20

63,235

4,088

2020–21

65,720

3,500

10% కూడా లేని ఎంటెక్ చేరికలు

రాష్ట్రంలో ఏటా బీటెక్లో చేరేవారి సంఖ్య 70 వేల వరకు ఉంటుంటే.. ఎంటెక్లో చేరే వాళ్ళ సంఖ్య పట్టుమని ఏడు వేలు కూడా ఉండటం లేదు. ఈ సంఖ్య ప్రతి ఏటా తగ్గిపోతుండటం తగ్గిపోతుండటం గమనార్హం. బోధన, పరిశోధనపై ఆసక్తి ఉన్న వాళ్లు కంప్యూటర్ సై¯Œ్సలో ఆర్టిఫీషియల్ ఇంటిలిజె¯Œ్స, సైబర్ సెక్యూరిటీ, ఎంబెడెడ్ సిస్టమ్స్, డిజై¯ŒS ఇంజనీరింగ్ వంటి బ్రాంచ్ల్లో మాత్రమే ఎక్కువగా ఎంటెక్ చేస్తున్నారు. కేవలం టీచింగ్ వృత్తిలోనే కొనసాగే ఆలోచన ఉన్న వాళ్ళు ఎంటెక్ చేస్తున్నారు. ఐఐటీలు, ఎ¯ŒSఐటీలు, ప్రైవేటు విద్యా సంస్థలన్నీ కలిపి ఎంటెక్లో చేరిక పరిస్థితి ఇలా ఉంటే.. ఏటా కెనడా, ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్కు వెళ్ళే విద్యార్థుల సంఖ్య 15 వేల వరకు ఉంటోందని అనధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కేవలం అమెరికాకే వెళ్తున్న విద్యార్థుల సంఖ్య 12 వేల వరకూ ఉంటోంది.

చదవండి:

Education: సరికొత్తగా ఆన్ లైన్ బోధన.. దిశ, దశ మార్చుకోనున్న డిజిటల్‌ విప్లవం..

JEE 2022: మార్పులు.. చేర్పుల దిశగా కేంద్రం కసరత్తు

Engineering: కొలువులున్నా.. ఇంజనీరింగ్‌ ఫ్రెషర్స్‌కు శాపంగా నైపుణ్యం కొరత

Published date : 03 Jan 2022 01:29PM

Photo Stories