Skip to main content

మళ్లీ అదే అన్యాయం!ఐఐటీ అభ్యర్థులకు టాప్-20 పర్సంటైల్ గండం- తెలుగు విద్యార్థులకు 92 శాతం కటాఫ్

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) విద్యా సంస్థల్లో అడ్మిషన్ల వ్యవహారం మళ్లీ వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీ విషయంలో గందరగోళం తలెత్తగా.. తాజాగా మరో విషయం తెలుగు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) నిబంధనల ప్రకారం అడ్వాన్స్‌డ్‌లో సాధించిన మార్కులతో పాటు ఆయా రాష్ట్రాల బోర్డులు నిర్వహించిన ఇంటర్మీడియట్ మార్కుల ప్రకారం టాప్-20 పర్సంటైల్‌లో ఉంటేనే ఐఐటీలో సీటు పొందేందుకు అర్హులవుతారు. ఒకవేళ టాప్ 20 పర్సంటైల్ జాబితాలో లేకపోతే సదరు విద్యార్థికి ఐఐటీ అడ్మిషన్ దక్కదన్నమాట! ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి సీబీఎస్‌ఈ అధికారులు వివిధ రాష్ట్రాల టాప్-20 పర్సంటైల్‌కు సంబంధించిన కటాఫ్ మార్కులను ప్రకటించారు. దీని ప్రకారం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి 1000 మార్కులకు గాను జనరల్ అభ్యర్థికి కనీసం 920 మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఒక్క ద్వితీయ సంవత్సరం మార్కులనే పరిగణనలోకి తీసుకుంటే 530 మార్కులకు గాను 492 కంటే ఎక్కువ మార్కులు రావాలి. అలాంటి విద్యార్థులే ఐఐటీలో చేరేందుకు అర్హులు. ఇంటర్‌లో ఈ మేరకు టాప్-20 పర్సంటైల్ కటాఫ్ మార్కులు(92 శాతం) సాధించకుంటే.. ఐఐటీ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధించినా ప్రయోజనం ఉండదు. అయితే ఇతర రాష్ట్రాల్లో చూస్తే ఈ కటాఫ్ చాలా తక్కువగా ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా జాతీయ స్థాయి మెరిట్‌తో ప్రవేశాలు కల్పించాల్సిన ఐఐటీల్లో ఇలాంటి పొంతన లేని విధానాలతో తెలుగు విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఇతర రాష్ట్ర విద్యార్థులతో పోల్చుకుంటే రాష్ట్ర విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినా ఐఐటీలో సీటు పొందలేని పరిస్థితి నెలకొంది. ఇక ఇంటర్ లేదా 12వ తరగతి మార్కులను ఇప్పటికీ పంపించని వారి విషయంలో మాత్రం కటాఫ్ మార్కులు మరో రకంగా ఉన్నాయి. సీబీఎస్‌ఈ అర్హత పరీక్షలో ప్రకటించిన మేరకు జనరల్ అభ్యర్థికి 83.2% మార్కులు వస్తే చాలు!. సీబీఎస్‌ఈ విధానాన్నే అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయకుండా ఒక్కో రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోని పోటీని బట్టి కటాఫ్ మార్కులను నిర్ణయించడం సమస్యకు కారణం అవుతోంది. దీనిపై తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. కాగా, మన ఇంటర్ బోర్డు విద్యార్థులకు సీబీఎస్‌ఈ రెండు రకాల అవకాశం కల్పించింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం మార్కులను మాత్రమే కటాఫ్ కోసం చూపించవచ్చు లేదా రెండేళ్ల మార్కులనూ పరిగణనలోకి తీసుకునేందుకు చూపించుకోవచ్చు. మార్కులు ఇవ్వకుంటే సీబీఎస్‌ఈ కటాఫ్ వర్తించనుంది. దీని ప్రకారం ఇంటర్‌లో జనరల్ అభ్యర్థులకు 83.2%, ఓబీసీకి 82 %, ఎస్సీలకు 74%, ఎస్టీలకు 73.2 శాతం మార్కులు వస్తే చాలు.

పాలిటెక్నిక్ విద్యార్థులకు షాక్
పాలిటెక్నిక్ డిప్లొమా హోల్డర్లకు సీబీఎస్‌ఈ షాక్ ఇచ్చింది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించినప్పటికీ వారు ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్/బీఆర్క్/బీప్లానింగ్‌లో చేరేందుకు అనర్హులని తాజాగా పేర్కొంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం వారికి 12వ తరగతి సర్టిఫికెట్ లేనందున పాలిటెక్నిక్ విద్యార్థులు అనర్హులని స్పష్టం చేసింది. మరోవైపు 12వ తరగతి/తత్సమాన పరీక్ష మార్కులను ధ్రువీకరించేందుకు చేసేందుకు గడువును జులై 3 వరకు పొడిగించింది. గత నెల 27 వరకు మొదట్లో చివరి తేదీగా ప్రకటించినా దానిని సోమవారం వరకు పొడగించింది. తాజాగా 3వ తేదీ వరకు మళ్లీ పొడిగించింది. దీనిప్రకారం జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంకులను ఈ నెల 7న ప్రకటించనుంది. ఈ మేరకు ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు సెంట్రల్ సీట్ అలాట్‌మెంట్ బోర్డు గతంలో ప్రకటించిన ప్రవేశాల షెడ్యూల్ మారనుంది.

వివిధ రాష్ట్రాల్లో టాప్ 20 పర్సంటైల్ కటాఫ్ వివరాలు

రాష్ట్రం

జనరల్

ఓబీసీ

ఎస్సీ

ఎస్టీ

పీడబ్ల్యూడీ

మొత్తం
మార్కులు

జనరల్‌లో మార్కుల శాతం

ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ
(ఇంటర్ ద్వితీయ సంవత్సరం మార్కుల ఆధారంగా)

492

503

464

463

463

530

-92.83

ఆంధ్రప్రదేశ్/ తెలంగాణ
(ఇంటర్ రెండేళ్ల మార్కుల ఆధారంగా)

920

867

810

807

807

1000

-92

అస్సాం

292

294

278

238

238

500

58.4

బీహార్

304

300

301

300

300

500

-60.8

చత్తీస్‌గఢ్

325

302

289

276

276

500

-65

గోవా

511

502

487

499

487

700

73

గుజరాత్

545

511

504

459

459

700

-77.85

హర్యాన

383

374

353

351

351

500

-76.6

హిమాచల్‌ప్రదేశ్

579

565

590

545

545

800

72.37

జార్ఖండ్ అకడమిక్ కౌన్సిల్

285

288

274

277

274

500

-57

జార్ఖండ్

378

378

378

378

378

500

-75.6

కర్ణాటక

465

444

420

425

425

500

-93

కేరళ

830

732

746

721

721

1000

-83

మధ్యప్రదేశ్

367

346

334

318

318

500

73.4

మహారాష్ట్ర

461

437

415

405

405

600

-76.83

మణిపూర్

363

364

346

334

334

500

-72.6

మేఘాలయ

291

269

279

261

261

500

-58.2

మిజోరం

333

363

338

294

294

500

-66.6

నాగాలాండ్

319

338

308

286

286

500

-63.8

ఒడిశా

378

378

353

331

331

500

-75.6

పంజాబ్

334

330

315

317

315

450

-83.36

రాజస్థాన్

345

341

325

383

325

500

-69

తమిళనాడు

917

820

719

695

695

1000

-91.7

త్రిపుర

255

&

241

214

214

500

-51

ఉత్తరప్రదేశ్

396

387

373

375

373

500

-79.2

ఉత్తరాంచల్

324

309

294

300

294

500

-64.8

పశ్చిమ బెంగాల్

308

303

271

237

271

500

-61.6

సీబీఎస్‌ఈ

416

410

370

366

366

500

-83.2

ఐసీఎస్‌ఈ

425

410

404

362

362

500

85

Published date : 01 Jul 2014 11:00AM

Photo Stories