Skip to main content

మే 4 నుంచి పీసెట్ ప్రవేశ పరీక్షలు

ఏఎన్‌యూ (గుంటూరు): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీపీఈడీ, యూజీడీపీఈడీ కోర్సుల్లో 2019-20 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీసెట్ పరీక్షలు మే 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పీసెట్ కన్వీనర్ డాక్టర్ పీపీఎస్ పాల్‌కుమార్ తెలిపారు.
అభ్యర్థులు ప్రవేశ పరీక్షల షెడ్యూల్, హాల్ టికెట్లను www.sche.ao.gov.in/pecet వెబ్‌సైట్‌లో పొందవచ్చన్నారు. రూ.500 ఆలస్య రుసుముతో ఏపీ పీసెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 26వ తేదీ వరకు గడువు ఉందన్నారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లోని తప్పులను ఏప్రిల్ 28 వరకు సరిచేసుకోవచ్చని తెలిపారు.
Published date : 26 Apr 2019 06:22PM

Photo Stories