మే 28 నుంచి పీజీఈసెట్ ప్రవేశ పరీక్షలు
Sakshi Education
హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీఈసెట్-2018 ప్రవేశ పరీక్షలు మే 28 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి.
అభ్యర్థులు మే 26 వరకు రూ.10 వేల అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. మే 22 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఇప్పటివరకు పరీక్షకు 24,500 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది కంటే ఈసారి దరఖాస్తుల సంఖ్య 13 వేలు తగ్గింది. ఇంజనీరింగ్‌లో పీజీ సీట్లను కుదించడం, గేట్, ఇతర అర్హతల కారణంగా దరఖాస్తుల సంఖ్య తగ్గుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Published date : 11 May 2018 04:12PM