మే 14న టీఎస్ ఎంసెట్.. 24న ఫలితాలు
Sakshi Education
తెలంగాణలో ఈ నెల 14న ఎంసెట్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రమణారావు పేర్కొన్నారు.
మే 3న ఆయన విలేకరులతో మాట్లాడారు. 18న ఎంసెట్ కీ, 24న ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. ఎంసెట్ నిర్వహణలో భాగంగా ఇంజినీరింగ్ పరీక్షకు 251 సెంటర్లు, మెడికల్ అండ్ అగ్రికల్చరల్‌కు 172 సెంటర్లు ఏర్పాటుచేయనున్నట్లు చెప్పారు.
Published date : 04 May 2015 03:30PM