మార్చి 14 నుంచి ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్:తెలంగాణలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు జేఎన్‌టీయూహెచ్ తమ పరిధిలోని కాలేజీల్లో వసతులపై తనిఖీలకు సిద్ధమైంది.
మార్చి 14వ తేదీ నుంచి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీల (ఎఫ్‌ఎఫ్‌సీ) ఆధ్వర్యంలో కాలేజీల్లో తనిఖీలు చేపట్టనున్నట్లు జేఎన్‌టీయూ పేర్కొంది. కాలేజీలకు మంజూరైన ఇంటేక్, అందుకు సరిపడా సదుపాయాలు ఉన్నాయా? లేదా? ఫ్యాకల్టీ ఉన్నారా? లేరా? తదితర అంశాలపై వివరాలను సేకరించనుంది. వాటి ఆధారంగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వనుంది. లోపాలు ఉన్న కాలేజీలకు నోటీసులు జారీ చేయనుంది. లోపాలను సరిదిద్దుకున్న తర్వాత ఆ కాలేజీలకు అనుబంధ గుర్తింపును ఇవ్వనుంది.
Published date : 14 Mar 2019 04:53PM