Skip to main content

కొత్తగా 2 ‘మహీంద్ర’ ఇంజనీరింగ్ కాలేజీలు

హైదరాబాద్: దేశంలో కొత్తగా మరో రెండు ఇంజనీరింగ్ కాలేజీలను ప్రారంభించాలని నిర్ణయించినట్లు టెక్ మహీం ద్ర ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్స్ సీఈవో రాహుల్ భూమన్ వెల్లడించారు.
ఫ్రాన్స్‌కు చెందిన ప్రతిష్టాత్మక కాలేజీ ఇకొలి సెంట్రలెతో కలిసి దేశంలోనే మొదటి ఇంజనీరింగ్ కాలేజీని 2014-15లో హైదరాబాద్‌లో ప్రారంభించినట్లు తెలిపారు. కొత్తగా ఉత్తరాదిన ఒకటి, దక్షిణాదిన మరొకటి నెలకొల్పాలని సంస్థ నిర్ణయించిందన్నారు. ఏపీలోని తిరుపతిలో కాలేజీ ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందన్నారు. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
Published date : 16 Apr 2015 05:46PM

Photo Stories