కన్వీనర్ కోటాలో పెరిగిన ఇంజనీరింగ్ సీట్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ విభాగంలో కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయి. ఈనెల 15 నాటికి 61,441 సీట్లు కాగా 16వ తేదీకి ఆ సంఖ్య 62,188కి పెరిగింది.
మొత్తంగా సీట్ల సంఖ్య 91,076కు చేరింది. పెరిగిన సీట్ల వివరాలను ఎంసెట్ కన్వీనర్ ఎ.వాణీప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. అగ్రికల్చరల్ ఇంజనీరింగ్-32, ఏరోనాటి కల్-210, ఆటోమొబైల్-42, బయో-టె క్నా లజీ-21, బయో-మెడికల్-30, సివిల్ ఎన్విరాన్‌మెంటల్-60, కెమికల్-246, సివిల్-7788, సీఎస్‌ఈ- 16668, డెయిరీ యింగ్-20, ఈసీఈ-15322, ఎలక్ట్రాని క్స్ అండ్ కంప్యూటర్-84, ఈఈఈ- 8412, ఈఐఈ-238, ఈటీఈ-42, ఫుడ్ సైన్‌స-43, ఫుడ్‌ప్రాసెసింగ్ టెక్నాలజీ- 20, ఫెసిలిటీస్ అండ్ సర్వీసెస్ ప్లానింగ్ - 60, ఐటి-2487, ఇండస్ట్రియల్ ప్రొడక్ష న్-70, మెకానికల్(మెక్ట్రోనిక్స్)-42, మె కానికల్-9872, మెటలార్జికల్-60, మైనిం గ్-97, మెటలార్జీ అండ్ మెటీరియల్- 42, మెటీరియల్ సైన్‌స అండ్ నానో టెక్నాలజీ- 60, ప్లానింగ్-40, టెక్స్‌టైల్ టెక్నాలజీ- 20 సీట్లను కన్వీనర్ కింద నిర్ణయించారు.
Published date : 17 Jun 2017 01:14PM