కేఎల్ వర్సిటీలో ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష
Sakshi Education
హైదరాబాద్: కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి ఏప్రిల్ 28, 29, 30 తేదీల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు వర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు హవీష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతోనే ఏటా దేశవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. పరీక్షలో ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులకు స్కాలర్ షిప్ కింద 25 శాతం నుంచి 100 శాతం వరకు ఫీజులో మినహాయింపు ఉంటుందని స్పష్టం చేశారు. మొత్తం 160 మార్కులకు ఉండే ఈ పరీక్షను ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ విధానంలో ఉంటుందన్నారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, 26, 27వ తేదీ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, నల్లగొండలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ www.kluniversity.in ను చూడొచ్చన్నారు.
Published date : 26 Apr 2018 03:06PM