కేఎల్ డీమ్డ్ వర్సిటీ ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్‌లలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను వర్సిటీ ఉపాధ్యక్షుడు కోనేరు రాజా హరీన్ మే 3న విడుదల చేశారు.
ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు చెప్పారు. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు మే 10 నుంచి 14 వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షలో 1 నుంచి 20 వరకు ర్యాంకులు పొందిన విద్యార్థులకు 100% స్కాలర్‌షిప్‌తోపాటు, నగదు బహుమతులను కూడా అందిస్తామన్నారు. వర్సిటీ వీసీ డా.ఎల్‌ఎస్‌ఎస్ రెడ్డి మాట్లాడుతూ.. కేఎల్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షతోపాటు, ఎంసెట్, జేఈఈ, ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు, ర్యాంకులు సాధించిన విద్యార్థులకూ ప్రాధాన్యమిచ్చి ఉపకార వేతనం కింద ట్యూషన్ ఫీజుల్లో రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీ ప్రవేశాల విభాగం డెరైక్టర్ పి.శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మొదటి 20 ర్యాంకులు పొందిన విద్యార్థులకు రూ.25 లక్షల వరకు నగదు బహుమతులను అందిస్తున్నట్లు చెప్పారు.
Published date : 04 May 2018 02:29PM