Skip to main content

ఆ కాలేజీల్లోని విద్యార్థుల భవిష్యత్తెలా?

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఎంసెట్-2015లో కన్వీనర్ కోటా సీట్లకు గురువారం ముగిసిన రెండోవిడత కౌన్సెలింగ్‌లో 50 కాలేజీల్లో ‘జీరో అడ్మిషన్లు’ (ఒక్క విద్యార్థీ చేరని కాలేజీలు) ఉండగా అనేక కాలేజీల్లో సగం సీట్లు కూడా భర్తీకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు సంబంధించి తొలివిడత కౌన్సెలింగ్‌లో జీరో అడ్మిషన్ కాలేజీలు ఏడు మాత్రమే ఉండగా అవి రెండోవిడతకు వచ్చేసరికి 50కి చేరుకున్నాయి. తొలివిడత లో చేరిన వారు రెండోవిడతలో వేరే కాలేజీకి ఆప్షన్లు ఇవ్వడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రథమ సంవత్సరంలో జీరో అడ్మిషన్లతోపాటు అన్ని కోర్సుల్లో కలిపి 100 నుంచి 150 మంది కూడా చేరని కాలేజీల సంఖ్య 250 వరకు ఉంది. దీంతో ఈ కాలేజీల మనుగడ ఎలా అన్నది ప్రశ్నార్థకమవుతోంది.

రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 1,12,525 ఉండగా రెండు విడతల కౌన్సెలింగ్ కలుపుకొని 76,928 మంది సీట్లు పొందారు. 36,324 సీట్లు ఇంకా మిగిలి ఉన్నాయి. జీరో అడ్మిషన్ల కాలేజీలతో పాటు అరకొరగా అడ్మిషన్లు జరిగిన కాలేజీలకు సంబంధించి ఎలా ముందుకు వెళ్లాలన్న చర్చ అధికారుల్లో, ఇటు తల్లిదండ్రుల్లోనూ కొనసాగుతోంది.

కాలేజీల మనుగడ సాధ్యమేనా
మొత్తం సీట్లలో మూడువంతులైనా విద్యార్థులు చేరితేనే ఆ కాలేజీల మనుగడ సాధించగలుగుతాయి. అరకొరగా ఉన్న సంస్థల నిర్వహణ కష్టసాధ్యమవుతుంది. అలాంటి కాలేజీలను యాజమాన్యాలు ఏదో ఒకలా కొనసాగించినా అక్కడ సరైన ఫ్యాకల్టీ, ఇతర సౌకర్యాలు ఏర్పాటుచేసే అవకాశం ఉండదు. దీనివల్ల ఆయా కాలేజీల్లో చేరిన విద్యార్థులు తీవ్రంగా నష్టపోకతప్పదు. వాస్తవానికి తక్కువ మంది విద్యార్థులున్న కాలేజీల మనుగడ కష్టమని, ఈ విషయాన్ని తెలుసుకొనేలా ఎంసెట్ వెబ్‌సైట్‌లో ఆయా కాలేజీల ప్రవేశాలపై సమగ్ర వివరాలను అధికారులు పొందుపరిచారు. వాటిని చూసుకున్న తరువాత రెండో విడతలో విద్యార్థులు తమ ఆప్షన్లు మార్చుకుంటారన్న ఉద్దేశంతోనే ఇలా చేశారు. విద్యార్థులు ఆప్షన్లు మార్చుకొని ఇతర కాలేజీలకు వెళ్తే సమస్య అక్కడితో సమసిపోతుందని భావించారు. అయినా అరొకర అడ్మిషన్లు జరిగిన కాలేజీలు 250 వరకు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ తరుణంలో మూడోవిడత కౌన్సెలింగ్‌ను నిర్వహించడం మంచిదన్న సూచనలు నిపుణుల నుంచి వస్తున్నాయి. అరకొర అడ్మిషన్లున్న కాలేజీల విద్యార్థులు ఈ మూడో విడతలో ఇతర కాలేజీల్లోకి వారంతట వారే మారుతారని, తద్వారా సాంకేతిక పరమైన సమస్యలు రావని పేర్కొంటున్నారు.

కాలేజీల వారీగా భర్తీ అయిన సీట్ల వివరాలు

సీట్లు

కళాశాలలు

సీట్లు

కళాశాలలు

0

50

1 - 5

65

6 - 10

22

11 - 15

11

16 - 20

11

21 - 25

5

26 - 30

6

31 - 35

7

36 - 40

1

41 -45

5

46 - 50

3

51 - 55

4

56 - 60

5

61 - 65

2

66 -70

3

71 - 75

4

76 - 80

4

81 - 85

3

86 - 90

4

91 - 100

7

Published date : 18 Jul 2015 02:31PM

Photo Stories