జేఎన్‌టీయూహెచ్‌కు నేడు ఏఏఏ కమిటీ
దేశంలోనే పేరెన్నిక గల పలు జాతీయ సంస్థల ప్రతినిధులతో కూడిన అకడమిక్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్(ఏఏఏ) కమిటీ డిసెంబర్ 8న విశ్వవిద్యాలయానికి రానుంది. వర్సిటీ ప్రమాణాలను ఈ కమిటీ పరిశీలించి పురోగతిని నిర్ధారించబోతోంది. బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్) ప్రొఫెసర్ డాక్టర్ కేటీ జాకోబ్ నేతృత్వంలోని ఈ కమిటీలో ప్రొఫెసర్ కె.బైరప్ప(మంగుళూరు వర్సిటీ వీసీ), ప్రొఫెసర్ కె.భాస్కర్ (ఇంఫాల్ ఐఐటీ డైరెక్టర్), డాక్టర్ బీఎస్ మధుకర్ (న్యాక్ మాజీ సలహాదారు), ప్రొఫెసర్ రామకృష్ణ వ్యాస్ (ఎండోమెంట్ చైర్ ప్రొఫెసర్, దేవీ అహల్యా యూనివర్సిటీ) సభ్యులుగా ఉంటారు.
చదవండి: software jobs : సాఫ్ట్‌వేర్ కొలువు.. ఇక చాలా సులువు!
ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ విద్యలో వర్సిటీ చేపడుతున్న సరికొత్త విధానాలు, సమీకృత మార్పులు, పరిశోధన, డేటా, రిసోర్స్ వివరాలను కమిటీ పరిశీలిస్తుంది. వర్సిటీలోని మౌలిక వసతులు, అంతర్జాతీయ ప్రమాణాలను పరిశీలించి ఏఏఏ కమిటీ ఇచ్చే నివేదిక జాతీయ ర్యాంకులు, న్యాక్ గుర్తింపు ప్రక్రియకు దోహదపడుతుంది.
చదవండి: ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి ఎదగాలి
కొత్త ట్రెండ్‌పైనే గురి
జేఎన్‌టీయూహెచ్–2021లో జాతీయ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్‌ఐఆర్‌ఎఫ్)లో సాంకేతిక విద్య సంస్థల విభాగంలో 62వ ర్యాంకు సాధించింది. 15కుపైగా ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు, 70కిపైగా వాల్యూయాడెడ్ కోర్సులు,13 కొత్తకోర్సులను అందిస్తోంది. 2021లో 173 మెగా జాబ్‌మేళాలు నిర్వహించి, 17 వేల మందికి ఉపాధి లభించేందుకు దోహదపడింది. ఏఏఏ కమిటీ వీటని పరిశీలించి, వర్సిటీ స్థాయిని నిర్ధారిస్తుంది.
చదవండి: JNTUH: ‘బయోమెట్రిక్’ లేకపోతే ఫ్యాకల్టీగా పరిగణించం..
పరిశీలన శుభపరిణామం
వర్సిటీ కీర్తిప్రతిష్టలను ఇతర రాష్ట్రాల నిపుణులు పరిశీలించడం శుభపరిణామం. దీనివల్ల నైపుణ్యం, వినూత్నపోకడలు జాతీయస్థాయిలో వెలుగులోకి వస్తాయి. న్యాక్, జాతీయ ర్యాంకుల కోసం ఇది దోహదపడుతుంది.
– ప్రొ.కె.నర్సింహారెడ్డి, జేఎన్‌టీయూహెచ్ వీసీ