Skip to main content

జూన్ 5 వరకే ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా 58,732మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు.
ఎంసెట్‌కు 1,36,305 విద్యార్థులు హాజరు కాగా.. అందులో 1,06,646 మంది విద్యా ర్థులు అర్హత సాధించారు. వారిలో ఒకటి నుంచి చివరి ర్యాంకు వరకు ఉన్న విద్యార్థు లకు మే 28 నుంచి వెరిఫికేషన్‌ను ప్రవేశాల క్యాంపు నిర్వహించింది. ఆ ప్రక్రియ జూన్ 3తో ముగిసింది. ఈ వెరిఫికేషన్‌కు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు 55,354 మంది, ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని వారు 1,807 మంది, శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని వారు 1,157 మం ది, ఇతర రాష్ట్రాల వారు 414 మంది హాజరై నట్లు ప్రవేశాల క్యాంపు కార్యాలయం అధికారి శ్రీనివాస్ తెలిపారు. అందులో 36,163 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారన్నారు. మిగతా విద్యార్థులు జూన్ 5లోగా వెబ్ ఆప్షన్లు ఇచ్చు కోవాలని సూచించారు. విద్యార్థులు ఎక్కువ ఆప్షన్లు ఇచ్చుకోవాలన్నారు. సీట్ల కేటాయింపును జూన్8న ప్రకటిస్తామని వెల్లడించారు.
Published date : 04 Jun 2018 02:47PM

Photo Stories